Asianet News TeluguAsianet News Telugu

అరకు ఘటన: కిడారి కోసం ఆ భవనంలోనే, ఆ రోజు ఇలా....

అరకు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమల కోసం లివిటిపుట్టు గ్రామంలో నిర్మాణంలో ఉన్న భవనంలో సాయుధులైన  మావోయిస్టులు ఎదురుచూసినట్టుగా పోలీసులు గుర్తించారు. 

what happened that day at livitiputtu in araku segment
Author
Araku, First Published Sep 27, 2018, 12:52 PM IST

అరకు:అరకు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమల కోసం లివిటిపుట్టు గ్రామంలో నిర్మాణంలో ఉన్న భవనంలో సాయుధులైన  మావోయిస్టులు ఎదురుచూసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే వాహనశ్రేణిని గుర్తించి రోడ్డుకు పక్కగా ఉన్న చెట్ల పొదల నుండి ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి తుపాకులను గురిపెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు.

డుబ్రిగుంట మండలం కూండ్రం పంచాయితీ పరిధిలోని సర్రాయి గ్రామంలో గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యే  సర్వేశ్వరరావును ఆ గ్రామానికి చెందిన కార్యకర్తలు కోరారు. వారం రోజుల క్రితమే ఈ కార్యక్రమం ఖరారైంది.

ఈ విషయం మావోలకు  చేరింది. దీంతో  ఎమ్మెల్యే సర్వేశ్వరరావు కోసం  మావోలు ఎదురుచూసినట్టుగా  పోలీసులు అభిప్రాయపడుతున్నారు.  లివిటిపుట్టులో 30 కుటుంబాల్లో 200 మంది నివశిస్తున్నారు. గ్రామస్తుల్లో చాలామంది క్రైస్తవులు. వీరిలో కొంతమంది ప్రతి ఆదివారం ఉదయం సమీపంలోని భల్లుగూడ, స్వర్ణాయిగూడ, కొరంజుగూడల్లో ప్రార్థనలకు వెళ్లి సాయంత్రానికి తిరిగివస్తారు. మిగిలిన వారు పశువుల పెంపకం, వ్యవసాయ పనులు, అటవీ పనులకు వెళ్తారు.

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య జరిగిన రోజు కూడ  గ్రామంలో ఎక్కువమంది చర్చిలకు వెళ్లారు.దీంతో గ్రామ మధ్యలోనే నిర్మాణంలో ఉన్న భవనంలో మావోయిస్టులు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే వాహనం కోసం ఎదురుచూశారు.ఈ భవనంలో కూర్చొని చూస్తే రోడ్డుపై వెళ్లే వాహనాలు కూడ  కన్పిస్తాయి.

అంతేకాదు సుమారు అరకిలోమీటరు దూరం నుండి వాహనాలు వచ్చే విషయాన్ని కూడ సులువుగా గుర్తించే వెసులుబాటు కూడ ఉంది. దీంతో ఈ భవనాన్ని మావోలు అనువుగా ఎంచుకొన్నారు. అంతేకాదు  ఈ ప్రాంతం మావోల సంచారం లేదని పోలీసులు చెబుతుండేవారు. దీంతో ఈ ప్రాంతమైతే  పోలీసులు కూడ ఎక్కువగా దృష్టి ఉండదని మావోలు భావించి ఉంటారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

సంబంధిత వార్తలు

కిడారి హత్య.. మావోయిలకు సహకరించింది ఎవరు..?

‘‘రాజకీయాలు వదిలేస్తా.. అన్నా వదిలేయండి’’.. మావోలను వేడుకున్న కిడారి.. అయినా కాల్చేశారు

అరకు ఘటన: లివిటిపుట్టునే మావోలు ఎందుకు ఎంచుకొన్నారంటే?

అరకు ఘటన: గన్‌మెన్లతో సర్వేశ్వరావు చివరి మాటలివే....

ఎమ్మెల్యే హత్య: పోలీసుల చేతిలో వీడియో ఫుటేజ్.. పారిపోతున్న ఆ ఇద్దరు ఎవరు..?

కిడారి హత్య.. కుటుంబానికి రూ.42లక్షల పరిహారం

అరకు ఘటన: అక్కడే నెల రోజులుగా మావోల శిక్షణ

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే

కొనసాగుతున్న సర్వేశ్వరరావు అంతిమయాత్ర

కిడారికి ముందే పోలీసుల హెచ్చరిక: నోటీసు ఇదే

అరకు ఘటన: బైక్‌పై సంఘటనా స్థలానికి పోలీస్ బాస్‌లు, ఎందుకంటే?

కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...

మా సమాచారమంతా మావోల వద్ద ఉంది: వెంకటరాజు

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్

బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా

15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు

నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు

నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య

అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

 

Follow Us:
Download App:
  • android
  • ios