విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యపై పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల చేతికి కీలక వీడియో ఫుటేజ్ దొరికింది. దీనిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోలు హతమార్చిన తర్వాత ... ఆ ప్రాంతానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు.

మృతదేహాలను పరిశీలించి.. ఆ ప్రాంతమంతా కలియదిరిగి అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ఆ ఇద్దరు ఎవరు అన్న దానిపై పోలీసుల్లో కొత్త అనుమానాలు వస్తున్నాయి. మావోయిస్టులా..? లేక మిలిషీయా సభ్యులా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

అరకు ఘటన: అక్కడే నెల రోజులుగా మావోల శిక్షణ

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే

చంద్రబాబు, నేదురుమల్లి.. మావోల పంజాకి చిక్కిన వారి జాబితా పెద్దదే

కిడారికి ముందే పోలీసుల హెచ్చరిక: నోటీసు ఇదే...

కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...