Asianet News TeluguAsianet News Telugu

కిడారి హత్య.. మావోయిలకు సహకరించింది ఎవరు..?

కండ్రూం గ్రామంలో పార్టీ సమావేశం ఉందని, అక్కడ భారీగా చేరికలు కూడా ఉంటాయని చెప్పిన వెంటనే ముందూ వెనుకా ముందు ఆలోచించకుండా కిడారి, సోమ అక్కడికి ప్రయాణమై మావోయిస్టులకు దొరికిపోయారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది.

who supported moaists to kill kidari
Author
Hyderabad, First Published Sep 27, 2018, 11:34 AM IST

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే.. వాళ్లను చంపేందుకు మావోయిస్టులకు సహకరించింది ఎవరు..? వారి గురించి మావోలకు సమాచారం అందించింది ఎవరు..? అనే విషయాలపై ఇప్పుడు పోలీసులు దృష్టిసారించారు. నేతలు ఇద్దరినీ నమ్మినవారే ముంచారనే అభిప్రాయానికి పోలీసులు వచ్చారు.

‘ఎమ్మెల్యేను లివిటిపుట్టువైపు తీసుకురావాలి’ అన్న మావోయిస్టు ఆకాంక్షలకు అనుగుణంగా కొందరు నడుచుకున్నారని, ఎమ్మెల్యే పర్యటనను అటువైపు ఖరారు చేశారని తెలుస్తోంది. కండ్రూం గ్రామంలో పార్టీ సమావేశం ఉందని, అక్కడ భారీగా చేరికలు కూడా ఉంటాయని చెప్పిన వెంటనే ముందూ వెనుకా ముందు ఆలోచించకుండా కిడారి, సోమ అక్కడికి ప్రయాణమై మావోయిస్టులకు దొరికిపోయారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది.

 మరోవైపు... కిడారి రెండేళ్ల కింద టీడీపీలో చేరడంతో ప్రత్యర్థి పార్టీకి చెందిన స్థానిక నేతలు, కార్యకర్తల్లో కొందరు గుర్రుగా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కిడారి వెంట పార్టీ మారిన వారిలో కొంతమందిని మావోయిస్టులు తమకు అనుకూలంగా మార్చుకున్నారేమోనని అనుమానిస్తున్నారు.

శనివారం సర్రాయి గ్రామ సమీపంలో ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతం వద్ద మావోయిస్టు అగ్రనేతలు సమావేశమైనట్లు తెలుస్తోంది. అదేరోజు రాత్రి ఈ దళాలు సర్రాయి, కండ్రూం, గుంటసీమ, తూటంగి, దాతూరు, లివిటిపుట్టు పరిసరాల్లో మోహరించినట్లు తెలిసింది. ఆదివారం ఉదయం లివిటిపుట్టు పరిసర గామాలన్నీ గుప్పెట్లోకి తీసుకున్న మావోయిస్టులు ఎమ్మెల్యే, సోమ వాహనాలను అడ్డగించి, అదుపులోకి తీసుకుని చంపినట్లు తెలుస్తోంది. 

హత్య జరిగిన గంట వరకూ పరిసర గ్రామాల్లోనే మావోయిస్టులు ఉన్నట్లు చెబుతున్నారు. సుమారు 2గంటల తర్వాత వివిధ మార్గాల్లో గుంటసీమ మీదుగా ఒడిశా అడవుల్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయినట్టు తెలిసింది. నిజానికి... మావోయిస్టులు ఎమ్మెల్యే కిడారి కోసమే ప్రణాళిక రచించారని, సివేరి సోమ కూడా దొరకడంతో ఆయనను కూడా చంపేశారని చెబుతున్నారు

 

more news

‘‘రాజకీయాలు వదిలేస్తా.. అన్నా వదిలేయండి’’.. మావోలను వేడుకున్న కిడారి.. అయినా కాల్చేశారు

అరకు ఘటన: లివిటిపుట్టునే మావోలు ఎందుకు ఎంచుకొన్నారంటే?

అరకు ఘటన: గన్‌మెన్లతో సర్వేశ్వరావు చివరి మాటలివే....

ఎమ్మెల్యే హత్య: పోలీసుల చేతిలో వీడియో ఫుటేజ్.. పారిపోతున్న ఆ ఇద్దరు ఎవరు..?

కిడారి హత్య.. కుటుంబానికి రూ.42లక్షల పరిహారం

అరకు ఘటన: అక్కడే నెల రోజులుగా మావోల శిక్షణ

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే

కొనసాగుతున్న సర్వేశ్వరరావు అంతిమయాత్ర

కిడారికి ముందే పోలీసుల హెచ్చరిక: నోటీసు ఇదే

అరకు ఘటన: బైక్‌పై సంఘటనా స్థలానికి పోలీస్ బాస్‌లు, ఎందుకంటే?

కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...

Follow Us:
Download App:
  • android
  • ios