Asianet News TeluguAsianet News Telugu

కొనసాగుతున్న సర్వేశ్వరరావు అంతిమయాత్ర

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అంతిమ యాత్ర పాడేరులో సోమవారం నాడు సాగింది.

araku mla sarveswar rao final rites begins
Author
Araku, First Published Sep 24, 2018, 3:11 PM IST

పాడేరు: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అంతిమ యాత్ర పాడేరులో సోమవారం నాడు సాగింది. ఎమ్మెల్యే సర్వేశ్వరరావు పాడేరులోనే పుట్టారు. కుటుంబసభ్యుల కోరిక మేరకు  సర్వేశ్వరరావు అంత్యక్రియలను  పాడేరులో నిర్వహిస్తున్నారు.

ఆదివారం నాడు లిప్పిట్టిపుట్టు  ప్రాంతంలో మావోయిస్టులు మాటు వేసి అరకు ఎమ్మెల్యే  సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే  సివిరి సోమను చంపేశారు. 
సర్వేశ్వరరావు కుటుంబసభ్యులు  పాడేరులో అంత్యక్రియలను నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. పాడేరులో అంతిమయాత్ర సాగింది. 

మంత్రులు, టీడీపీ ప్రజాప్రతినిధులు,  సర్వేశ్వరరావు అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మావోలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గిరిజన సంప్రదాయం ప్రకారంగా అంత్యక్రియలను నిర్వహించేలా ప్లాన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో  అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.

ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే  సివిరి సోమ అంత్యక్రియలు అరకులో నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో  అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

కిడారికి ముందే పోలీసుల హెచ్చరిక: నోటీసు ఇదే

అరకు ఘటన: బైక్‌పై సంఘటనా స్థలానికి పోలీస్ బాస్‌లు, ఎందుకంటే?

కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...

మా సమాచారమంతా మావోల వద్ద ఉంది: వెంకటరాజు

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్

బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా

15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు

నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు

నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య

అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios