మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆదివారం నాడు మావోయిస్టులు కాల్పులు జరిపారు. పలుమార్లు కిడారి సర్వేశ్వరరావును హెచ్చరించారు. మావోల కాల్పుల్లో సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ మృతి చెందారు.
అరకు: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆదివారం నాడు మావోయిస్టులు కాల్పులు జరిపారు. పలుమార్లు కిడారి సర్వేశ్వరరావును హెచ్చరించారు. మావోల కాల్పుల్లో సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ మృతి చెందారు.
2014 ఎన్నికల్లో కిడారి సర్వేశ్వరరావు వైసీపీ నుండి విజయం సాధించారు. ఇటీవలనే కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేరారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో కిడారి సర్వేశ్వరరావు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.
""
డుంబ్రిగుంట మండలం లిప్పిట్టిపుట్టు వద్ద అరకు ఎమ్మెల్యేపై మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ మృతి చెందారు.
ఆదివారం నాడు గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు సర్వేశ్వరరావు వెళ్తుండగా మావోలు దాడికి పాల్పడినట్టు సమాచారం.ఈ దాడిలో సుమారు 50 మంది మావోలు పాల్గొన్నారని సమాచారం.