జగన్ పై లోకేష్ సెటైర్లు : మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Jul 15, 2019, 6:55 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

వాళ్లలా కాదు, రా... రా.. అని చర్చకు పిలుస్తున్నాం: మంత్రి అనిల్ సెటైర్లు

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఏపీ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. ప్రాజెక్ట్‌లో అంచనా వ్యయాన్ని టీడీపీ ప్రభుత్వం విపరీతంగా పెంచిందంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. 

 

 

బాబుకు పట్టిన గతే జగన్‌కు కూడా: శివరాజ్ సింగ్ చౌహాన్

చంద్రబాబుకు పట్టిన గతే  ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు పడుతుందని హిమాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం  శివరాజ్ సింగ్ చౌహాన్ హెచ్చరించారు. గతంలో చంద్రబాబునాయుడు ఏ రకంగా  ఒకే కులానికి ప్రాధాన్యతఇచ్చారో... జగన్‌ కూడ అదే రకంగా వ్యవహరించారన్నారని ఆరోపించారు.
 

 

కేశినేని నాని, బుద్దా వెంకన్నల ట్వీట్స్: స్పందించిన వైసీపీ నేత పొట్లూరి

 విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య  ట్వీట్ల యుద్దంపై  వైఎస్ఆర్‌సీపీ నేత  పొట్లూరి  వరప్రసాద్ స్పందించారు. ప్రజలకు సేవ చేసేందుకు పనిచేస్తారా... ట్వీట్లతో కాలయాపన చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.

 

 

వైఎస్ వల్లే ఏపీకి కియా.. బాబు చేసేందేమిలేదు: ఆధారాలతో బయటపెట్టిన బుగ్గన

పెట్టుబడుల అంశంపై ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. టీడీపీ హయాంలో ఎన్నో ఎంఓయూలు జరిగాయని చెప్పారని.. వాటిలో ఏ ఒక్కటి శిలాఫలకం దాకా వెళ్లలేదని వైసీపీ నేతలు ఆరోపించారు.

 

 

చంద్రగ్రహణం, ముగ్గురి బలి: అనంతలో క్షుద్రపూజల కలకలం

అనంతపురం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. కొరసికోటలో అనుమానస్పద స్థితిలో మూడు మృతదేహాలు లభ్యంకావడంతో క్షుద్రపూజలు చేసి హతమార్చినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు

 

 

రాజీనామా చేస్తా: నేరుగా చంద్రబాబుకు గురిపెట్టి కేశినేని ట్వీట్

పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ కేశినేని నాని ట్వీట్ చేశారు. చంద్రబాబు గారూ... నా లాంటివాళ్లు పార్టీలో ఉండకూడదని మీరు అనుకుంటే.. పార్లమెంటు సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి ఎలా రాజీనామా చేయాలో చెప్పండి అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

 

 

పీపీఏల రద్దు వల్ల పెట్టుబడులు ఆగవు: అజయ్ కల్లం

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం అభిప్రాయపడ్డారు. పీపీఏల రద్దు వల్ల పెట్టుబడులు రావని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
 

 

హామీలు ఏమయ్యాయి: సర్కార్‌పై లోకేష్ ధ్వజం

 ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి  నారా లోకేష్ సోమవారం నాడు శాసనమండలిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫమైందన్నారు.

 

 

తిరుమలలో రెచ్చిపోయిన ఎలుగుబంటి: అలిగిన భక్తురాలిపై దాడి

గత వారం రోజులుగా ఆమె టీటీడీ పరిసర ప్రాంతాల్లోనే ఉంటుందని తెలిసింది. హైదరాబాద్ లో ఆర్ఆర్ బికి కోచింగ్ తీసుకుంటున్నవిజయలక్ష్మికి కుటుంబసభ్యులు సహకరించకపోవడంతో తిరుమల వచ్చేసినట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం బాధితురాలు స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు తెలుస్తోంది. 

 

 

అలా జరిగి ఉంటే రాష్ట్రం వేరేలా ఉండేది: ఏపీఐఐసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రోజా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే మరింత అభివృద్ధి చేందేదదని రోజా అభిప్రాయపడ్డారు. రాయితీలు వచ్చి మరింత పారిశ్రామికంగా అభివృద్ధి చెందేవాళ్లమన్నారు. రాష్ట్రంలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా అద్భుతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. 

 

 

రాంప్రసాద్ హత్య: కోగంటి సత్యం సహా ఐదుగురు అరెస్ట్

ప్రముఖ పారిశ్రామిక వేత్త రాంప్రసాద్ హత్యలో కోగంటి సత్యంతో సహా మరో ఐదుగురిని అరెస్ట్ చేసినట్టుగా బంజారాహిల్స్‌ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు.
సోమవారం నాడు ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

 

 

సప్లిమెంటరీ పరీక్షపైనా వివాదం: తెలంగాణ ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన

తెలంగాణ ఇంటర్‌బోర్డ్ మరోసారి వివాదంలో ఇరుక్కుంది. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యంకనం సరిగా చేయలేదంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు నాంపల్లిలోని ఇంటర్‌బోర్డ్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. 

 

 

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్

సంగారెడ్డి: జలదీక్షకు వెళ్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.  అరెస్టు చేసిన జగ్గారెడ్డిని కొండాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

 

 

బాలయ్యతో సినిమాపై పూరి కామెంట్!

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్.. బాలయ్యతో కలిసి గతంలో 'పైసా వసూల్' సినిమా తీశాడు. ఆ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా.. పూరి వర్కింగ్ స్టైల్ బాలయ్యకి బాగా నచ్చింది. అందుకే మరో సినిమా చేయడానికి అప్పట్లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

 

సైరాతో వార్.. ఎఫెక్ట్ తప్పేలా లేదు?

సౌత్  పాన్ ఇండియన్ సినిమాలకు గట్టిపోటీని ఇవ్వాలని గత కొంత కాలంగా బాలీవుడ్ సరికొత్త అడుగులు వేస్తోంది. అయినప్పటికీ నార్త్ సినిమాలు క్లిక్కవడం లేదు. అక్టోబర్ లో సైరాను ఎలాగైనా డీ కొట్టాలని ఒక బాలీవుడ్ యాక్షన్ సినిమా సిద్ధమైంది. 
 

 

‘కబీర్ సింగ్‌’ విషయమై మాట మార్చిన విజయ్ దేవరకొండ

బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘కబీర్‌ సింగ్‌’. తెలుగులో బ్లాక్‌బస్టర్‌ హిట్ అయిన  ‘అర్జున్‌రెడ్డి’ సినిమాకు ఇది రీమేక్‌ . మాతృకను తెరకెక్కించిన సందీప్‌ రెడ్డి వంగానే ‘కబీర్ సింగ్‌’ని కూడా తెరకెక్కించారు.  ‘అర్జున్‌రెడ్డి’లో చూపించిన సీన్స్ నే హిందీలోనూ చూపించారు.   కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం జూన్‌ 21న రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయ్యింది.

 

 

పాప ఎవరి పోలిక.. సమీరా రెడ్డి సమాధానంపై విమర్శల వెల్లువ!

సమీరా రెడ్డి సినిమాలకు దూరమైనా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. గర్భవతి అయినప్పటికీ ఫోటో షూట్స్ తో యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే సమీరా రెడ్డి రెండవ కాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. కుమార్తె పుట్టిన తర్వాత సమీరా రెడ్డి తొలిసారి ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 

 

ఇగో లేకుండా నయనతారపై కామెంట్స్.. సైరా గురించి తమన్నా!

మిల్కీ బ్యూటీ తమన్నా మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరాలో కీలక పాత్రలో నటిస్తోంది. చిత్ర యూనిట్ ఇప్పటికే తమన్నా లుక్ ని కూడా రిలీజ్ చేసింది. 

 

 

రష్మిక పాత ఎఫైర్ పై క్వశ్చన్.. ఫైర్ అయిన విజయ్ దేవరకొండ!

కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో కొంతకాలం ప్రేమాయణం సాగించిన రష్మిక మందన్నా నిశ్చితార్ధం కూడా చేసుకుంది. కొన్ని రోజుల్లో పెళ్లి అనగా.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ సంఘటన జరిగిన దగ్గర నుండి మీడియాలో రష్మికకి రక్షిత్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

 

 

నగ్నంగా ఎలా నటిస్తుంది.. హీరోయిన్ కి బుద్ధి లేదా!

హీరోయిన్ కి బట్టలేకుండా ఉండే సన్నివేశాలు ఎందుకు రాశారు.. దర్శకుడికి బుద్ధి ఉండే ఈ సన్నివేశాలు రాశారా.. న్యూడ్ గా నటించాలని తెలిసినా అమలాపాల్ ఎందుకు ఒప్పుకుంది.. ఆమెకు కూడా బుద్ధి లేదా అని కామెంట్స్ చేశారు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్.

click me!