భారీ బడ్జెట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వార్ కి సిద్ధమైతే జనాల్లో ఒక స్పెషల్ ఎట్రాక్షన్ మొదలవుతుంది. ఎలాంటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద గెలుస్తుందా అనే ఆలోచనలు ఉత్కంఠను కలిగిస్తాయి. ఇక సౌత్  పాన్ ఇండియన్ సినిమాలకు గట్టిపోటీని ఇవ్వాలని గత కొంత కాలంగా బాలీవుడ్ సరికొత్త అడుగులు వేస్తోంది. 

అయినప్పటికీ నార్త్ సినిమాలు క్లిక్కవడం లేదు. అక్టోబర్ లో సైరాను ఎలాగైనా డీ కొట్టాలని ఒక బాలీవుడ్ యాక్షన్ సినిమా సిద్ధమైంది. హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ వార్ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. సైరా రిలీజ్ డేట్ ఇంకా కన్ఫార్మ్ కాకపోయినప్పటికీ అదే డేట్ ను ఫైనల్ చేసే అవకాశం ఉంది. 

ఎందుకంటే ఆ డేట్ మిస్సయితే మళ్ళీ సంక్రాంతివరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వీలైనంత వరకు అక్టోబర్ లో  తెలుగుతో పాటు హిందీ - తమిళ్ లో  కూడా సైరాను రిలీజ్ చేసేందుకు నిర్మాత రామ్ చరణ్ ప్లాన్ వేస్తున్నాడు. ఇక వార్ సినిమా కూడా అదే తరహాలో డబ్ చేసి సౌత్ లాంగ్వేజ్ లలో రిలీజ్ చేయనున్నారు. మరి ఈ ఫైట్ డోస్ కలెక్షన్స్ పై ఎలాంటి ఎఫెక్ట్  చూపిస్తుందో చూడాలి.