టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్.. బాలయ్యతో కలిసి గతంలో 'పైసా వసూల్' సినిమా తీశాడు. ఆ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా.. పూరి వర్కింగ్ స్టైల్ బాలయ్యకి బాగా నచ్చింది. అందుకే మరో సినిమా చేయడానికి అప్పట్లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఎన్టీఆర్ బయోపిక్ తరువాత పూరి-బాలయ్య కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అన్నారు. కానీ బాలయ్య.. కేఎస్ రవికుమార్ సినిమా మొదలుపెట్టాడు. పూరి కూడా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బిజీ అయిపోయాడు. ఇప్పుడు 'ఇస్మార్ట్ శంకర్' రిలీజ్ అవుతోంది.

బాలయ్యతో మరోసారి కలిసి పని చేయడానికి పూరి ఆసక్తి చూపిస్తున్నాడు. మరి బాలయ్యతో సినిమా ఎప్పుడు ఉంటుందని ప్రశ్నిస్తే.. ఆయనకు తగ్గ కథ రాసుకోవాలని, అది ఎప్పుడు సిద్ధమైనా.. సరే ఆయన దగ్గర వాలిపోతానని అన్నారు. తన దగ్గర కొన్ని కథలున్నాయని.. కానీ బాలయ్యతో అంటే మనం కొత్తగా ఏమైనా రాసుకోవాలని అన్నారు. 

బాలయ్య అన్ని రకాల సినిమాలు చేశారని.. ఏ కథ చేద్దామన్న.. ఆ టైప్ కథలు నాలుగైదు ఆయన ఖాతాలో ఉంటాయని అందుకే ఈసారి బాలయ్య కోసం కొత్తగా ఓ కథ రాద్దామనుకుంటున్నా.. అని చెప్పారు.

ఆ కథ పూర్తయితే బాలయ్యకి వినిపిస్తానని చెప్పారు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా గనుక హిట్ అయితే బాలయ్య కూడా పూరితో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపడం ఖాయం!