కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో కొంతకాలం ప్రేమాయణం సాగించిన రష్మిక మందన్నా నిశ్చితార్ధం కూడా చేసుకుంది. కొన్ని రోజుల్లో పెళ్లి అనగా.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ సంఘటన జరిగిన దగ్గర నుండి మీడియాలో రష్మికకి రక్షిత్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

తాజాగా 'డియర్ కామ్రేడ్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక తన టీంతో కలిసి బెంగుళూరుకి వెళ్ళింది. అయితే అక్కడ కూడా ఆమెకి తన పాత ఎఫైర్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో కల్పించుకున్న విజయ్ దేవరకొండ రష్మిక బ్రేకప్ గురించి అడిగిన జర్నలిస్ట్ పై ఫైర్ అయ్యారు.

''మీరేం అడుగుతున్నారో నాకు అర్ధం కావడం లేదు. ఇది ఏ ఒక్కరి వ్యక్తిగతమైన మీటింగ్ కాదు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్.. ఇందులో ఇతర అనవసరమైన విషయాలు తీసుకురావొద్దు'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కొందరు రిపోర్టర్లు ఆమెను అవే ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు.

సోషల్ మీడియాలో పేజీలో ఫ్యాన్స్ కూడా మీ బ్రేకప్ గురించి అడుగుతున్నారని.. కాబట్టి స్పందించాలంటూ ఆమెని ప్రశ్నించారు. దీనికి రష్మిక.. తనకు అభిమానులతో మంచి రాపో ఉందని.. వారితో నా అభిప్రాయాలు తరచూ పంచుకుంటూ ఉంటానని, తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తుంటానని అసలు విషయం దాటేసింది. రక్షిత్ శెట్టితో కలిసి నటించడానికి సిద్ధమేనా..? అనే ప్రశ్నకు 'చూద్దాం' అని సమాధానమిచ్చింది.