అమరావతి: ఏపీ ఐఐసీ చైర్మన్ గా వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా బాధ్యతలు చేపట్టారు. ఏపీఐఐసీ చైర్మన్ గా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలోకి ఇతర కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే మరింత అభివృద్ధి చేందేదదని రోజా అభిప్రాయపడ్డారు. రాయితీలు వచ్చి మరింత పారిశ్రామికంగా అభివృద్ధి చెందేవాళ్లమన్నారు. రాష్ట్రంలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా అద్భుతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. 

ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పారిశ్రామికీకరణకు అత్యధిక శతాతం నిధులు వైయస్ జగన్ కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. పరిశ్రమలలో స్థానికంగా ఉండే యువతకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రోజా హామీ ఇచ్చారు. రోజా బాధ్యతల స్వీకారానికి ఆమె భర్త సెల్వమణి, వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితోపాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.