అనంతపురం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. కొరసికోటలో అనుమానస్పద స్థితిలో మూడు మృతదేహాలు లభ్యంకావడంతో క్షుద్రపూజలు చేసి హతమార్చినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన వారిని హనుమమ్మ, సత్యలక్ష్మీ, శివరామిరెడ్డిగా గుర్తించారు. మంగళవారం చంద్రగ్రహణం కావడంతో క్షుద్రపూజల సంఘటనలు గతంలోనూ జరగడంతో స్థానికుల వాదనను బలపరుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.