ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ సోమవారం నాడు శాసనమండలిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫమైందన్నారు.
అమరావతి: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ సోమవారం నాడు శాసనమండలిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫమైందన్నారు.
సోమవారం నాడు ఏపీ శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల రుణాలను మాఫీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ వడ్డీ లేని రుణాలను ఇస్తున్నామని గొప్పగా చెప్పుకొన్న జగన్ సర్కార్ బడ్జెట్‌లో మాత్రం కేవలం రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించిందని ఆయన విమర్శలు గుప్పించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వడ్డీ లేని రుణాలపై తీసుకొన్న నిర్ణయాన్ని తమ ప్రభుత్వం కూడ కొనసాగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
సకాలంలో రైతులకు విత్తనాలు సరఫరా చేయడంలో సర్కార్ విఫలం చెందిందని ఆయన విమర్శలు గుప్పించారు. కానీ పాదయాత్రలో జగన్ చేసిన హామీలను ఆయన గుర్తు చేశారు. ఏపీ రాష్ట్రానికి అందాల్సిన విత్తనాలు తెలంగాణకు పంపారని ఆయన ఆరోపించారు.
తమ ప్రభుత్వం 6 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగభృతిని అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ, నిరుద్యోగభృతిని ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు.
