విజయవాడ: గత కొద్ది రోజులుగా పార్టీలోని కొంత మంది నేతలపై తీవ్రమైన విమర్శలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరోసారి ట్వీట్ ద్వారా సంచలనం సృష్టిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు, కేశినేని నానికి మధ్య గత కొద్ది రోజులుగా ట్విట్టర్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.

తాజాగా, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ కేశినేని నాని ట్వీట్ చేశారు. తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు గారూ... నా లాంటివాళ్లు పార్టీలో ఉండకూడదని మీరు అనుకుంటే.. పార్లమెంటు సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి ఎలా రాజీనామా చేయాలో చెప్పండి అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

తన లాంటివాళ్లు పార్టీలో కొనసాగాలనుకుంటే మీ పెంపుడు కుక్కలను నియంత్రంచిండని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. చాలా కాలంగా కేశినేని నిరసన గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే.