విజయవాడ:  విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య  ట్వీట్ల యుద్దంపై  వైఎస్ఆర్‌సీపీ నేత  పొట్లూరి  వరప్రసాద్ స్పందించారు. ప్రజలకు సేవ చేసేందుకు పనిచేస్తారా... ట్వీట్లతో కాలయాపన చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.

 

సోమవారం నాడు ట్విట్టర్ వేదికగా పొట్లూరి వరప్రసాద్  కేశినేని నాని, బుద్దా వెంకన్నల ట్వీట్లపై వ్యాఖ్యానించారు.  ఈ ఇద్దరు నేతలు చేసుకొన్న  పరస్పర ఆరోపణలపై తాము ఏకీభవిస్తున్నట్టుగా ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకొంటే ప్రజలకు సేవ చేయకుండానే  కాలక్షేపం చేస్తున్నారని పొట్లూరి వరప్రసాద్ వ్యాఖ్యానించారు. 

 

సంబంధిత వార్తలు

కారణమిదే: కేశినేని నాని వర్సెస్ బుద్దా వెంకన్న

ట్వీట్ల యుద్దం: కేశినేని నాని, బుద్దా వెంకన్నలకు హైకమాండ్‌ నుండి ఫోన్లు