సమీరా రెడ్డి సినిమాలకు దూరమైనా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. గర్భవతి అయినప్పటికీ ఫోటో షూట్స్ తో యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే సమీరా రెడ్డి రెండవ కాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. కుమార్తె పుట్టిన తర్వాత సమీరా రెడ్డి తొలిసారి ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

బుధవారం రోజు వైద్య పరీక్షలు చేయించుకున్నా. వైద్యులు నాకు సిజేరియన్ చేయాలని చెప్పారు. దీనితో శుక్రవారం అపాయింట్ మెంట్ తీసుకున్నా. ఆ రోజు తొలి ఏకాదశి. మా ఇంట్లోకి ఆడబిడ్డ ప్రవేశించిన రోజు అని సమీరా రెడ్డి తెలిపింది. నాకు పాప పుట్టిన తర్వాత చాలా కానుకలు వచ్చాయి. బహుశా పాప కోసం ఇప్పట్లో షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు అని సమీరా రెడ్డి సరదాగా తెలిపింది. 

ఇంతకీ పాప ఎవరి పోలిక అని విలేకరి ప్రశ్నించగా సమీరా రెడ్డి ఇచ్చిన సమాధానమే వివాదంగా మారింది. పాప నా లాగా నల్లగా లేదు. తెల్లగా ముద్దొచ్చేలా ఉంది. అందుకు నేను హ్యాపీ అని సమీరా కామెంట్ చేసింది. పాప పోలిక గురించి అడిగినప్పుడు రంగు గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది.. పాప ఏ రంగులో ఉంటే ఏం అంటూ నెటిజన్లు సమీరా కామెంట్స్ పై మండిపడుతున్నారు.