తిరుమల: తిరుమల భూగర్భడ్యాం దగ్గర ఎలుగుబంటి హల్ చల్ చేసింది. బూగర్భడ్యాం దగ్గర ఓ యువతి స్నానం చేసి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా ఎలుగుబంటి దాడికి పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. 

యువతిని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆమెను టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి పరామర్శించారు. దాడిఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలుగుబంటి దాడిలో గాయపడ్డ బాధితురాలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన విజయలక్ష్మీగా పోలీసులు గుర్తించారు. 

గత వారం రోజులుగా ఆమె టీటీడీ పరిసర ప్రాంతాల్లోనే ఉంటుందని తెలిసింది. హైదరాబాద్ లో ఆర్ఆర్ బికి కోచింగ్ తీసుకుంటున్నవిజయలక్ష్మికి కుటుంబసభ్యులు సహకరించకపోవడంతో తిరుమల వచ్చేసినట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం బాధితురాలు స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు తెలుస్తోంది.