మిల్కీ బ్యూటీ తమన్నా మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరాలో కీలక పాత్రలో నటిస్తోంది. చిత్ర యూనిట్ ఇప్పటికే తమన్నా లుక్ ని కూడా రిలీజ్ చేసింది. తమన్నా లుక్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరక్కుతున్న చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రాన్ని దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. 

చిరు తొలిసారి స్వాతంత్ర సమరయోధుడిగా ఉయ్యాలవాడ నరసింహార్ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. సైరా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో సైరా చిత్రం గురించి మాట్లాడింది. ఈ చిత్రం తనకు డబుల్ జాక్ పాట్ లాంటిదని పేర్కొంది. 

చిరంజీవి నటిస్తున్న ఇంతటి భారీ చిత్రంలో భాగం కావడం ఒక అంశం. నేను అభిమానించే నటి నయనతార. ఆమెతో కలసి కొన్ని సన్నివేశాల్లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నా అని తమన్నా పేర్కొంది. ఈ రెడ్డి సైరా చిత్రంలో తనకు చాలా సంతోషాన్నిచ్చే అంశాలని తమన్నా తెలిపింది. 

నయనతార సౌత్ లో లేడీ సూపర్ స్టార్ లా దూసుకుపోతోంది. తమన్నాకు కూడా సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. సాధారణంగా స్టార్స్ మధ్య ఇగో ఫీలింగ్స్ ఉంటాయి. అలాంటివేమీ లేకుండా తమన్నా తాను నయన్ కు అభిమానిని అని చెప్పడం గొప్ప విషయమే.