Asianet News TeluguAsianet News Telugu

పీపీఏల రద్దు వల్ల పెట్టుబడులు ఆగవు: అజయ్ కల్లం

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం అభిప్రాయపడ్డారు. పీపీఏల రద్దు వల్ల పెట్టుబడులు రావని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
 

suficient power production in andhrapradesh says ajay kallam
Author
Amaravathi, First Published Jul 15, 2019, 5:15 PM IST

అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం అభిప్రాయపడ్డారు. పీపీఏల రద్దు వల్ల పెట్టుబడులు రావని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

సోమవారం నాడు ఆయన అమరావతితో మీడియాతో మాట్లాడారు.దేశంలో పవన, సోలార్ విద్యుత్ ధరలు భారీగా తగ్గాయని  ఆయన  గుర్తు చేశారు. ఏపీలో సరిపోయేంత విద్యుత్ ఉత్పత్తి సాగుతుందని  అజయ్ కల్లం చెప్పారు. ఏపీలో సరిపోయేంత విద్యుత్ ఉత్పత్తి సాగుతున్న తరుణంలో ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు అవసరమా అని ఆయన ప్రశ్నించారు.

గత ప్రభుత్వం పీపీఏలను రూ.6లకు యూనిట్ చొప్పున చేసుకొందని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. 

సోమవారం నాడు ఆయన అమరావతితో మీడియాతో మాట్లాడారు.దేశంలో పవన, సోలార్ విద్యుత్ ధరలు భారీగా తగ్గాయని  ఆయన  గుర్తు చేశారు. ఏపీలో సరిపోయేంత విద్యుత్ ఉత్పత్తి సాగుతుందని  అజయ్ కల్లం చెప్పారు. ఏపీలో సరిపోయేంత విద్యుత్ ఉత్పత్తి సాగుతున్న తరుణంలో ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు అవసరమా అని ఆయన ప్రశ్నించారు.

గత ప్రభుత్వం పీపీఏలను రూ.6లకు యూనిట్ చొప్పున చేసుకొందని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు.  గత ప్రభుత్వం  యూనిట్ విద్యుత్ ను రూ.6 కొనుగోలు చేసిందన్నారు. కానీ, ఈ విద్యుత్ ఒప్పందాలను ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించాలని నిర్ణయం తీసుకొన్నారని ఆయన చెప్పారు.

గత మూడేళ్లలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను కేంద్ర ప్రభుత్వం పలు దఫాలు  పాయింట్ అవుట్ చేసిందన్నారు. 2018 నాటికి రూ.18 రూపాయాలుగా ఉన్న సౌర ,విద్యుత్ ధర రూ. 2.44లకు పడిపోయిందని ఆయన చెప్పారు. పవన విద్యుత్ ధర యూనిట్ కు  రూ. 4.20 లనుండి 40 పైసలకు పడిపోయిందని ఆయన చెప్పారు. 

ఈ లెక్కలను ఎకనామిక్ సర్వే విడుదల చేసిందని ఆయన గుర్తు చేశారు.  కానీ, గత ప్రభుత్వం రూ.6లకు యూనిట్ విద్యుత్ ను కొనుగోలు చేసుకొందని ఆయన చెప్పారు. టెండరింగ్ ప్రక్రియ కాకంుడా ఎక్కువ ధరకు  విద్యుత్ ను కొనుగోలు చేయడం సరైందా అని ఆయన ప్రశ్నించారు.  

ఈ విద్యుత్ ఒప్పందాల వల్ల  ప్రజలకు ఏం ఉపయోగమని ఆయన ప్రశ్నించారు.  రాష్ట్రంలో 5 మె.వా. విద్యుత్ ను ఇచ్చేందుకు రూ.2లకుఇచ్చేందుకు రెడీగా ఉన్నారని అజయ్ కల్లం చెప్పారు. ఎలాంటి పీపీఏలు లేకుండానే 5 మెగావాట్ల విద్యుత్ ను ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios