వారికి జగన్ ఝలక్: టాప్ స్టోరీస్

By rajesh yFirst Published Jun 22, 2019, 5:52 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం
 

భారీగా బదిలీలు: చంద్రబాబు పేషీలోని ఐఎఎస్ లకు నో పోస్టింగ్స్

కీలకమైన ఆర్థిక శాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్న ముద్దాడ రవిచంద్ర సాంఘిక సంక్షేమ శాఖకు బదిలీ అయ్యారు. గతంలో జిఎడికి పంపిన అధికారులకు ఇప్పుడు పోస్టింగులు లభించాయి. 
 

కేటీఆర్ సిఫార్సు: దిల్ రాజు కోరిక తీరుస్తున్న వైఎస్ జగన్?

వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో దిల్ రాజు కూడా పాల్గొన్నారు. దిల్ రాజు వెంకటేశ్వర స్వామి భక్తుడు. తన బ్యానర్ కు కూడా శ్రీవారి మీద భక్తితోనే దిల్ రాజు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ అని పెట్టుకున్నారు. 
 

 

పవన్ కల్యాణ్ పై సీ గ్రేడ్ కామెంట్లు చేశారు: నాగబాబు

కొత్త రాష్ట్రం కాబట్టి అప్పట్లో సీనియర్‌ నాయకుడైతే సమర్థంగా నడపగలరనే ఉద్దేశంతో చంద్రబాబుకు పవన్‌ మద్దతు తెలిపినట్లు నాగబాబు చెప్పారు. ఆ సమయానికి పవన్ కల్యాన్ కు కనిపించిన క్లీన్‌ పర్సన్‌ చంద్రబాబు అని ఆయన అన్నారు.
 

పోలవరం: చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ నిందలు

పోలవరం ప్రాజెక్టు తనకు అత్యంత ప్రధానమైందని జగన్ చెప్పారు. వరదలు వస్తే నాలుగు నెలల పాటు పోలవరం ప్రాజెక్టు పనులు జరగవని, ఈ గందరగోళం గత ప్రభుత్వం వల్లనే ఏర్పడిందని ఆయన అన్నారు. 
 

చంద్రబాబు ఫోటో తీసి జగన్ ఫోటో.. మేయర్ రచ్చ

విజయవాడ నగర మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిల ఫోటోలు వివాదానికి దారితీశాయి. చంద్రబాబు ఫోటో తీసి.. జగన్ ఫోటో పెట్టడాన్ని మేయర్ తప్పుపట్టారు.
 

బిజెపిలోకి వారిని చంద్రబాబే పంపించారు: విజయసాయి

చంద్రబాబు విహార యాత్రకు ఏ దేశం వెళ్లారో ఆ పార్టీ నాయకులకు కూడా తెలియదా విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. స్విట్జర్లాండ్ వెళ్లారో స్వీడన్‌లో ఉన్నారో చెప్పలేనంత రహస్యమా అని అడిగారు
 

విదేశాల్లో చంద్రబాబు.. సామాగ్రి బయటపడేసిన వైసీపీ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశాల్లో ఉన్న సమయంలో అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు దారుణంగా ప్రవర్తించారు. ప్రజా వేదికలో ఉన్న చంద్రబాబు సామాగ్రిని వైసీపీ నేతలు బయటకు విసిరేయడం గమనార్హం
 

బిజెపి భారీ స్కెచ్: చంద్రబాబుకే కాదు, జగన్ కు సైతం ఎసరు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా వేయాలని భావిస్తున్న బిజెపి వల్ల దీర్షకాలికంగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ముప్పు తప్పకపోవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం కావడానికి బిజెపి దశలవారీగా తన వ్యూహాన్ని అమలు చేసే అవకాశాలున్నాయి. 
 

గంటా ప్లాన్: బిజెపిలో చేరే టీడీపీ ఎమ్మెల్యేలు వీరే?

ప్రస్తుతం గంటా కొలంబోలో ఉన్నారు. చాలా రోజు క్రితం నుంచే గంటా శ్రీనివాస రావు బిజెపి నేతలతో సంబంధాలు నెరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, తాను బిజెపిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని గంటా శ్రీనివాస రావు ఖండించారు. అయినప్పటికీ ఆ ప్రచారం ఆగడం లేదు. 
 

పాక్ కెప్టెన్ ఫోటోతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాక్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ ఫోటోని వాడుకుంటున్నారు. మీరు చదివింది నిజమే.
 

ఐదేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం

కన్నకూతురి పట్ల ఓ తండ్రి పాశవికంగా ప్రవర్తించాడు. తాగిన మైకంలో కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
 

ఇప్పట్లో సినిమాలు చేయను.. షారుఖ్ కామెంట్స్!

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కి ఈ మధ్యకాలంలో సరైన హిట్టు సినిమా పడలేదు. వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డ ఈ హీరో 'జీరో' సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతో షారుఖ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చేశాడు.
 

ఆ స్టార్లు చేస్తే కరెక్ట్.. నేను చేస్తే తప్పా..? స్టార్ హీరో ఫైర్!

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన 'కబీర్ సింగ్' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'అర్జున్ రెడ్డి'కి రీమేక్ గా దర్శకుడు సందీప్ వంగా ఈ సినిమాను రూపొందించాడు. ప్రేక్షకుల నుండి ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ కొందరు క్రిటిక్స్ మాత్రం ఈ సినిమాను ఏకిపారేస్తున్నారు.
 

అంజలిని విసిగిస్తున్న పెళ్లి టాపిక్.. మరోసారి క్లారిటీ

జర్నీ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరోయిన్ అంజలి ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, బలుపు లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం అంజలి ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటిస్తోంది. 
 

వరల్డ్ కప్ దెబ్బకి.. వెనక్కి తగ్గిన 'ఇస్మార్ట్ శంకర్'!

కాస్త స్మార్ట్ గా ఆలోచించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా టీమ్ రిలీజ్ డేట్ వాయిదా వేశాయి. సినిమా విడుదలకు ఇది కరెక్ట్ సీజన్ కాదని సినిమాను వాయిదా వేసుకున్నారు.  రామ్ హీరోగా దర్శకుడు పూరిజగన్నాథ్ రూపొందిస్తోన్న ఈ సినిమా జూలై 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు మరోవారం పాటు సినిమా వెనక్కి వెళ్లబోతుంది.
 

ఇంజనీర్లకు హ్యాట్సాఫ్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మహేష్ ప్రశంసలు!

తెలంగాణలో శుక్రవారం రోజు ప్రారంభమైన కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై మహేష్ బాబు ప్రశంసలు కురిపించాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
 

రూ.200 కోట్లతో పెళ్లి.. స్పెషల్ ఎట్రాక్షన్ గా కత్రినా డాన్స్!

మన సెలబ్రిటీలు సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ లోనే కాదు.. అప్పుడప్పుడు బయట ఫంక్షన్స్ లో కూడా ఆడుతుంటారు. తాజాగా కత్రినా కైఫ్ కూడా ఓ భారీ వివాహ వేడుకకు హాజరై సందడి చేసింది.
 

నిధి అగర్వాల్ కు మరో ఆఫర్.. క్రేజీ హీరోతో రొమాన్స్!

యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ నెమ్మదిగా మంచి అవకాశాలని అందుకుంటోంది. నిధి అగర్వాల్ కు స్టార్ హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 

20 రోజుల పాటు నగ్నంగా హీరోయిన్!

అమలాపాల్ ప్రస్తుతం నటిస్తున్న 'ఆమె' చిత్రం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ చర్చనీయాశంగా మారింది. అమలాపాల్ ఈ చిత్రంలో నగ్నంగా కొన్ని సన్నివేశాల్లో నటించింది.
 

విశాల్ నిజస్వరూపం ఇప్పుడే అర్ధమైంది.. సీనియర్ నటుడి కామెంట్స్!

కోలీవుడ్ నటుడు విశాల్ పై సీనియర్ నటుడు అరుణ్ పాండియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. శక్తి శివన్ హీరోగా, దర్శకుడిగా రూపొందిస్తోన్న చిత్రం 'దౌలత్'.
 

విజయ్ దేవరకొండ కొత్త స్ట్రాటజీ...మిగతా హీరోలకు మైండ్ బ్లాక్!

విజయ్ దేవరకొండ చాలా స్ట్రాటజీగా వెళ్తున్నారు. తన కెరీర్ లో ప్రతీ అడుగుని ఆచి తూచి వేస్తున్నారు. తెలుగులో అతి తక్కువ టైమ్ లోనే యూత్ లోకి దూసుకు వెళ్లిన విజయ్ ..ఇప్పుడు మిగతా భాషలని తన తాజా చిత్రం డియర్ కామ్రేడ్ తో టార్గెట్ చేస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన  `డియ‌ర్ కామ్రేడ్‌`  టీజర్‌ సినిమాపై అంచనాల్ని క్రియేట్‌ చేసింది. దాంతో పాటు, లిరికల్‌ వీడియోల ద్వారా వచ్చిన స్టిల్స్‌లో  ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చేస్తున్నాయి. 
 

మా కెప్టెన్ తప్పేం లేదు... పాక్ క్రికెటర్

పాక్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆ జట్టు క్రికెటర్ మహ్మద్ హఫీజ్ అభిప్రాయపడ్డారు. టీం ఇండియాతో జరిగిన మ్యాచ్ లో పాక్ ఘెరంగా ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే.
 

పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ కి ఘెర అవమానం

సర్ఫరాజ్ తన కుటుంబసభ్యులతో కలిసి షాపింగ్ కి వెళ్లారు. అక్కడ ఓ అభిమాని సర్ఫరాజ్ ని సెల్ఫీ అడిగాడు. దీనికి సర్ఫరాజ్‌ సైతం అంగీకరించాడు. కానీ అతని కొడుకు ఏడుస్తుండటంతో పక్కకు వెళ్లిపోయాడు. దీంతో ఆ అభిమాని పాక్‌ కెప్టెన్‌ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడు.

click me!