యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ నెమ్మదిగా మంచి అవకాశాలని అందుకుంటోంది. నిధి అగర్వాల్ కు స్టార్ హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. యువతని మాయచేసి గ్లామర్ ఆమె సొంతం. కొన్ని మంచి విజయాలు దక్కితే నిధి అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా మారడం ఖాయం. 

తాజాగా నిధి అగర్వాల్ మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుంది. తమిళ హీరో జయం రవి సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఇది జయం రవి ల్యాండ్ మార్క్ మూవీగా తెరకెక్కుతున్న 25వ చిత్రం. ఇటీవల ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. అదేవిధంగా జయం రవి ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్ళు పూర్తవుతోంది. నితిన్ తొలి చిత్రం జయంని తమిళంలో రీమేక్ చేశారు. జయం రవికి కూడా ఇదే ఫస్ట్ మూవీ. 

జయం ఘనవిజయం సాధించడంతో అతడు జయం రవిగా మారాడు. ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్ళు పూర్తి కావడంతో జయం రవి తన 25వ సినిమా ప్రారంభోత్సవంలో కేక్ కట్ చేశాడు. తని ఒరువన్, టిక్ టిక్ టిక్ లాంటి విజయాలు ఇటీవల జయం రవికి దక్కాయి. జయం రవి 25వ చిత్రం విజయం సాధిస్తే నిధి అగర్వాల్ తమిళంలో కూడా పాగా వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం నిధి అగర్వాల్ తెలుగులో ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటిస్తోంది.