బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన 'కబీర్ సింగ్' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'అర్జున్ రెడ్డి'కి రీమేక్ గా దర్శకుడు సందీప్ వంగా ఈ సినిమాను రూపొందించాడు. ప్రేక్షకుల నుండి ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ కొందరు క్రిటిక్స్ మాత్రం ఈ సినిమాను ఏకిపారేస్తున్నారు.

సినిమాలో హీరో బలవంతపు శృంగారాన్ని, అలాగే డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ ను భారీగా ప్రమోట్ చేస్తున్నాడంటూ కథనాలు రాయడం మొదలుపెట్టారు. మరికొందరు హీరోయిన్ ని కొట్టడంపై కామెంట్స్ చేస్తున్నారు.

దీని గురించి స్పందించిన షాహిద్.. ''మొన్న రిలీజైన గల్లీబాయ్ సినిమాలో అలియాభట్ తన బాయ్ ఫ్రెండ్ కి వేరొక అమ్మాయి మెసేజ్ పంపిందని ఆ అమ్మాయిని చితక్కొట్టుడు కొడుతుంది. ఆ సీన్ మీకు నచ్చింది కానీ నా సినిమాలో సీన్లలో మాత్రం తప్పులు దొరికాయా..?'' అంటూ రివర్స్ లో మీడియాని ప్రశ్నించారు.

షాహిద్ ఆవేదనలో కూడా నిజముంది.. గతంలో బాలీవుడ్ లో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, బద్లాపూర్ వంటి చిత్రాలలో సెక్స్, రేప్ సీన్ లను ఘోరంగా చూపించినా.. వాటిని ఆర్టిస్టిక్ ఫిలిమ్స్ అంటూ పొగిడిన బాలీవుడ్ క్రిటిక్స్ ఇప్పుడు షాహిద్ ని టార్గెట్ చేయడం చూస్తుంటే ఇదంతా కావాలనే చేస్తున్నారనిపిస్తుంది.

అయితే జనరల్ ఆడియన్స్ నుండి వస్తోన్న పబ్లిక్ టాక్ పాజిటివ్ గా ఉండడంతో టీమ్ రిలాక్స్ అవుతోంది.