అమలాపాల్ ప్రస్తుతం నటిస్తున్న 'ఆమె' చిత్రం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ చర్చనీయాశంగా మారింది. అమలాపాల్ ఈ చిత్రంలో నగ్నంగా కొన్ని సన్నివేశాల్లో నటించింది. అమలాపాల్ ఒంటరిగా ఒంటిపై ఎలాంటి బట్టలు లేకుండా కూర్చుకుని ఏడుస్తున్న దృశ్యాలని టీజర్ లో చూపించారు. 

అమలాపాల్ కు తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు ఉంది. అలాంటి నటి బోల్డ్ గా నటించడం సాహసోపేతమైన నిర్ణయమే. దీనితో అమలాపాల్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ సమంత లాంటి స్టార్ హీరోయిన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.టీజర్ కు మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కుతున్నాయి. అమలాపాల్ బోల్డ్ గా నటించిన సన్నివేశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయట. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ లో చిరిగిన బట్టలతో అమలాపాల్ కనిపించడం కూడా ఆసక్తిని రేపింది. 

నగ్నంగా నటించే సన్నివేశాల కోసం చిత్ర యూనిట్ 20 రోజుల పాటు షూటింగ్ జరిపినట్లు తెలుస్తోంది. 20 రోజుల పాటు బిడియం లేకుండా ఇలాంటి సన్నివేశాల్లో నటించడం అంటే మామూలు విషయం కాదు. అమలాపాల్ బైక్ పై స్టంట్స్, పోరాట సన్నివేశాలు ఈ చిత్రంలో ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయని అంటున్నారు.