విజయ్ దేవరకొండ చాలా స్ట్రాటజీగా వెళ్తున్నారు. తన కెరీర్ లో ప్రతీ అడుగుని ఆచి తూచి వేస్తున్నారు. 

విజయ్ దేవరకొండ చాలా స్ట్రాటజీగా వెళ్తున్నారు. తన కెరీర్ లో ప్రతీ అడుగుని ఆచి తూచి వేస్తున్నారు. తెలుగులో అతి తక్కువ టైమ్ లోనే యూత్ లోకి దూసుకు వెళ్లిన విజయ్ ..ఇప్పుడు మిగతా భాషలని తన తాజా చిత్రం డియర్ కామ్రేడ్ తో టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన `డియ‌ర్ కామ్రేడ్‌` టీజర్‌ సినిమాపై అంచనాల్ని క్రియేట్‌ చేసింది. దాంతో పాటు, లిరికల్‌ వీడియోల ద్వారా వచ్చిన స్టిల్స్‌లో ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చేస్తున్నాయి. 

'గీత గోవిందం' సినిమాతో విజయ్‌ దేవరకొండ, రష్మికా జంట టాలీవుడ్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ జంటగా పేరు తెచ్చేసుకుంది. దాంతో జోడీ పరంగానూ ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే, తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ ఈ సినిమాపై హైప్‌ ఇదే క్రియేట్ చేసే పనిలో ఉంది టీమ్. అందులో భాగంగా మళయాళ వెర్షన్ కోసం దుల్కర్ ని సీన్ లోకి తెచ్చారు.

గతంలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కలిసి మహానటి చిత్రం చేసారు. అప్పుడు ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. ఆ చనువుతో తన తాజా చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌` లో దుల్కర్ చేత ఓ పాట పాడించారు విజయ్ దేవరకొండ. అయితే దుల్కర్ పాడిన పాట తెలుగు వెర్షన్ కోసం కాదు. `డియ‌ర్ కామ్రేడ్‌` మ‌ల‌యాళ వెర్ష‌న్ కోసమట. దుల్క‌ర్ మంచి న‌టుడే కాదు.. మంచి సింగర్ కూడా. 

అక్కడ ఆయన పాడిన పాటలు పెద్ద హిట్ అయ్యాయి. దాంతో మళయాళ మార్కెట్ అటెన్షన్ ని గ్రాబ్ చేయటం కోసం దుల్కర్ ని సీన్ లోకి తెచ్చారు విజయ్. ఈ ఆలోచన విజయ్ దేవరకొండ దే అని తెలుస్తోంది. తనే స్వయంగా దుల్కర్ తో మాట్లాడి వర్కవుట్ చేసాడట. `డియ‌ర్ కామ్రేడ్‌` చిత్రం ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలోనూ జూలై 26న విడుదల కానుంది. 

డియ‌ర్ కామ్రేడ్ చిత్రానికి సంబంధించి మూడు పాటలు ఇప్ప‌టికే విడుద‌ల కాగా, మూడు సాంగ్స్ సంగీత ప్రియుల‌ని ఎంతగానో అల‌రించాయి. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర్ చిత్రానికి సంగీతం అందించారు.