భార్యను, ముగ్గురు పిల్లల్ని చంపేసిన ప్రైవేట్ ట్యూటర్

Published : Jun 22, 2019, 04:37 PM IST
భార్యను, ముగ్గురు పిల్లల్ని చంపేసిన ప్రైవేట్ ట్యూటర్

సారాంశం

మృత్యువాత పడిన ముగ్గురు చిన్నారుల్లో రెండు నెలల పసిపాప కూడా ఉంది. ఈ దారుణానికి పాల్పడిన శుక్లాను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  ఈ హత్యలు తానే చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అయితే ఎందుకు ఈ ఘటనకు పాల్పడ్డాడనే స్పష్టత లేదు. హత్యలు చేయడానికి గల కారణాన్ని అతను చెప్పలేదు. 

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని మెహ్రౌలీలో ఓ ప్రయివేట్‌ ట్యూటర్‌ తన భార్యను, ముగ్గురు పిల్లల్ని హత్య చేశాడు.  ట్యూటర్‌గా పనిచేస్తున్న ఉపేంద్ర శుక్లా శనివారం తెల్లవారుజామున భార్యను, పిల్లలను గొంతుకోసి చంపేశాడు. ఈ  సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 

అదే ఇంట్లో నివాసం ఉంటున్న శుక్లా అత్త తెల్లవారినా కూడా కూతురు, పిల్లలు గది నుంచి బయటకు రాకపోవడాన్ని గమనించింది. దాంతో తలుపులు కొట్టింది. అయినా తలుపులు తెరవకపోవడంతో స్థానికుల సాయం తీసుకుంది. బలవంతంగా తలుపులు తెరిచి చూడగా నలుగురు శవాలై కనిపించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

మృత్యువాత పడిన ముగ్గురు చిన్నారుల్లో రెండు నెలల పసిపాప కూడా ఉంది. ఈ దారుణానికి పాల్పడిన శుక్లాను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  ఈ హత్యలు తానే చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అయితే ఎందుకు ఈ ఘటనకు పాల్పడ్డాడనే స్పష్టత లేదు. హత్యలు చేయడానికి గల కారణాన్ని అతను చెప్పలేదు. 

గత కొంతకాలంగా శుక్లా మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu