మన సెలబ్రిటీలు సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ లోనే కాదు.. అప్పుడప్పుడు బయట ఫంక్షన్స్ లో కూడా ఆడుతుంటారు. 

మన సెలబ్రిటీలు సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ లోనే కాదు.. అప్పుడప్పుడు బయట ఫంక్షన్స్ లో కూడా ఆడుతుంటారు. తాజాగా కత్రినా కైఫ్ కూడా ఓ భారీ వివాహ వేడుకకు హాజరై సందడి చేసింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

డెహ్రాడూన్‌ లోని ఔలీ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు పెట్టి వివాహ వేడుకను ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో డాన్స్ చేయాల్సిందిగా కత్రినా కైఫ్ తో పాటు పలువురు సెలబ్రిటీలకు పిలుపు అందింది. రెమ్యునరేషన్ ఎక్కువగా ఆఫర్ చేయడంతో వారు కూడా ఒప్పుకున్నారు.

ఈ వేడుకలో కత్రినా తను నటించిన 'తీస్ మార్ ఖాన్' సినిమాలో 'షీలా కీ జవానీ' పాటకు డాన్స్ చేసి మెప్పించింది. కత్రినా డాన్స్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టేజ్ పై వధూవరులు కూడా సందడి చేశారు. బుల్లితెర నటి సురేభీ జ్యోతి కూడా డాన్స్ చేసింది.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల కత్రినా నటించిన 'భారత్' సినిమా విడుదలై మంచి హిట్ టాక్ దక్కించుకుంది.ప్రస్తుతం ఈమె అక్షయ్ కుమార్ కి జోడీగా 'సూర్యవంశీ' సినిమాలో నటిస్తోంది. 

View post on Instagram
View post on Instagram