జర్నీ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరోయిన్ అంజలి ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, బలుపు లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం అంజలి ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, హర్రర్ నేపథ్యం ఉన్న చిత్రాల్లో అంజలికి అవకాశాలు వస్తున్నాయి. 

హీరో జైతో అంజలి సాగించిన ప్రేమ వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది.  వీరిద్దరూ ఒకే ఫ్లాట్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. దీనితో త్వరలో జై, అంజలి పెళ్లిపీటలెక్కబోతున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. కానీ ఆ తర్వాత అంజలి, జై ప్రేమ బ్రేకప్ అయింది. 

తాజాగా అంజలి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. అంజలి, విజయ్ సేతుపతి కలసి నటించిన చిత్రం సింధుబాద్. ప్రస్తుతం తాను అన్నీ ఇలాంటి వైవిధ్యభరితమైన చిత్రాలే చేస్తున్నట్లుఅంజలి తెలిపింది. తణుకు బాలీవుడ్ లో నటించే ఉద్దేశం లేదని అంజలి తెలిపింది. తెలుగు, తమిళ భాషల్లో నటించడానికే ఇష్టపడతానని అంజలి పేర్కొంది. 

తనకు ఎక్కువగా పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అంజలి మరోమారు క్లారిటీ ఇచ్చింది. మరికొందరు రాజకీయాల్లోకి వస్తున్నారా అని కూడా అడుగుతున్నారు. రాజకీయాలు గురించి నాకు ఏమీ తెలియదు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదు. నాకు తెలిసిన పని నటించడమే. దాన్నే కొనసాగిస్తాను అంటూ అంజలి పేర్కొంది.