పాక్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆ జట్టు క్రికెటర్ మహ్మద్ హఫీజ్ అభిప్రాయపడ్డారు. టీం ఇండియాతో జరిగిన మ్యాచ్ లో పాక్ ఘెరంగా ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. కాగా... ఈ విషయంలో కెప్టెన్ సర్ఫరాజ్ పై నెటిజన్లతో సహా.. పలువురు సీనియర్ క్రికెటర్లు మండిపడ్డారు.

కాగా.. ఈ విషయంలో సర్ఫరాజ్ కి మహ్మద్ హఫీజ్ మద్దతుగా నిలిచాడు. టాస్ గెలిస్తే.. బ్యాటింగ్ మొదట భారత్ కి ఇవ్వాలన్న నిర్ణయం కేవలం కెప్టెన్ ది ఒక్కడిది మాత్రమే కాదని..  జట్టు అందరం కలిసి తీసుకున్న నిర్ణయమని హఫీజ్ చెప్పాడు. బౌలింగ్, బ్యాటింగ్ సరిగా చేయకపోవడం వల్ల మాత్రమే తాము ఓడిపోయామని  చెప్పారు. తమ కెప్టెన్ సర్ఫరాజ్ తప్పేమి లేదని.. ఓటమికి అతనిని బాధ్యుడ్ని చేసి నిందించడం కరెక్ట్ కాదని చెప్పాడు.

తమకు సెమిస్ కి వెళ్లడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయని.. భారత్ తో మ్యాచ్ తర్వాత తమకు కొంత సమయం దొరికిందని.. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని నూతనోత్సాహంతో ముందుకు సాగుతామని చెప్పుకొచ్చాడు.