బిజెపి భారీ స్కెచ్: చంద్రబాబుకే కాదు, జగన్ కు సైతం ఎసరు

First Published 22, Jun 2019, 11:39 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా వేయాలని భావిస్తున్న బిజెపి వల్ల దీర్షకాలికంగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ముప్పు తప్పకపోవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం కావడానికి బిజెపి దశలవారీగా తన వ్యూహాన్ని అమలు చేసే అవకాశాలున్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా వేయాలని భావిస్తున్న బిజెపి వల్ల దీర్షకాలికంగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ముప్పు తప్పకపోవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం కావడానికి బిజెపి దశలవారీగా తన వ్యూహాన్ని అమలు చేసే అవకాశాలున్నాయి. అందుకు బిజెపి నేతలు భారీ స్కెచ్ వేసి అమలు చేయడం ప్రారంభించారు.

ఇటీవలి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీని ఎపిలో రూపుమాపే ప్రయత్నాలకు బిజెపి ఒడిగట్టింది. చంద్రబాబును ఒంటరిని చేస్తూ నాయకులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను తన వైపు లాక్కోవడానికి భారీ కార్యాచరణ ప్రణాళికను రచించింది. ఇందులో భాగంగానే నలుగురు రాజ్యసభ ఎంపీలు బిజెపిలో చేరిపోయారు.

శానససభలో టీడీపిని ఖతం చేసేందుకు కూడా మరో వైపు ప్రణాళిక సిద్ధమై అమలులో ఉంది. కనీసం 16 మంది శాసనసభ్యులను తన వైపు లాక్కునేందుకు ప్రణాళిక రచించి అమలు చేస్తున్నట్లు ప్రచారం చేస్తోంది. ఇందుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రధానంగా పనిచేస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చడానికి సమయం పట్టవచ్చు. (ganta)

బిజెపితో వైఎస్ జగన్ సఖ్యంగా ఉండడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన బిజెపితో తలపడే పరిస్థితి లేదు. ప్రత్యేక హోదా నినాదాన్ని వదులుకోకుండానే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యంగా ఉంటూ రాష్ట్రానికి తగిన నిధులు, ఇతర సదుపాయాలు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తానని ఆయన అంటున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగేళ్ల పాటు చంద్రబాబు అనుసరించిన వైఖరికి ఇది భిన్నమేమీ కాదు.

చంద్రబాబు వైఖరికి జగన్ వైఖరికి మధ్య బిజెపి విషయంలో ఇసుమంత తేడా మాత్రమే ఉంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరడమే కాకుండా బిజెపిని చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంలో చేర్చుకున్నారు. ప్రత్యేక హోదాను కాదని కేంద్ర ప్రభుత్వం సూచించిన ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు. అయితే, వైఎస్ జగన్ తన ప్రత్యేక హోదా డిమాండ్ ను వదులుకోవడం లేదు. అదే సమయంలో ఎన్డీఎలో చేరడం లేదు.

ఫిరాయింపుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయమే దీర్షకాలికంగా ఆయన ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది. వైసిపిలో చేరడానికి ముందుకు వచ్చే వెసులుబాటు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు ఆయన తలుపులు మూసేశారు. దీంతో పార్టీ మారాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలకు బిజెపి తప్ప ప్రత్యామ్నాయం కనిపించడం లేదు

బిజెపికి క్యాడర్ లేదని, అందువల్ల ఆ పార్టీలో చేరడం వల్ల ప్రయోజనం లేదని కొంత మంది వాదిస్తున్నారు. నేతల ద్వారా క్యాడర్ దానంతటదే బిజెపి వైపు మళ్లే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల బిజెపి ప్రధానమైన తెలుగుదేశం పార్టీ నేతలకు గాలం వేస్తోంది. ఈ విషయంలో అది ఫలితం సాధించవచ్చు కూడా. ఆ రకంగా ఎపిలో వైఎస్సార్ కాంగ్రెసుకు తెలుగుదేశం పార్టీ కాకుండా బిజెపి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది.

తాను బలం పుంజుకునే వరకు నిరీక్షించి బిజెపి నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎసరు పెట్టే ప్రణాళికను అమలు చేసే అవకాశం లేకపోలేదు. రెండుమూడేళ్ల పాటు జగన్ పట్ల మెతక వైఖరి అవలంబించి, ఆతర్వాత ఆయనకు వ్యతిరేకంగా రాజకీయ సమరం సాగించే అవకాశం ఉంది. మెతక వైఖరి అవలంబిస్తూ కూడా జగన్ కు రాష్ట్రాభివృద్ధిలో పూర్తి స్థాయిలో కేంద్రం సహకరిస్తుందని చెప్పడానికి వీలు లేదు. అందువల్ల బిజెపి వచ్చే ఎన్నికల నాటికి ఎపిలో అధికారం చేజిక్కించుకునే దిశగా సాగడానికి జగన్ ను కూడా లక్ష్యం చేసుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు.

loader