కన్నకూతురి పట్ల ఓ తండ్రి పాశవికంగా ప్రవర్తించాడు. తాగిన మైకంలో కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలోని ద్వారకామయి కాలనీలో ఉంటున్న ఓ వ్యక్తికి  భార్య, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. తొమ్మిదేళ్ల క్రితం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు కుటుంబంతో సహా ఉపాధి కోసం వచ్చాడు.

 పీకల దాకా మద్యం తాగి ఇంటికి వచ్చిన అతను.. నిద్రపోతున్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  గమనించిన అతని భార్య వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న అతడిని పట్టుకొని అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడిని రిమాండ్ కి తరలించారు.