ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా తీయడం కంటే దాన్ని ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకువెళ్లడం పెద్ద టాస్క్ గా మారింది. అన్నింటినీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని రిలీజ్ చేసుకోవాలి. చాలా సినిమాలు సరైన పబ్లిసిటీ లేకనే కనుమరుగయ్యాయి.

అందుకే కాస్త స్మార్ట్ గా ఆలోచించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా టీమ్ రిలీజ్ డేట్ వాయిదా వేశాయి. సినిమా విడుదలకు ఇది కరెక్ట్ సీజన్ కాదని సినిమాను వాయిదా వేసుకున్నారు.  రామ్ హీరోగా దర్శకుడు పూరిజగన్నాథ్ రూపొందిస్తోన్న ఈ సినిమా జూలై 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు మరోవారం పాటు సినిమా వెనక్కి వెళ్లబోతుంది.

దీనికి కారణం.. కీలకమైన వరల్డ్ కప్ మ్యాచ్ లే అని తెలుస్తుంది. క్రికెట్ ఫైనల్ లోకి ఇండియా వస్తే అప్పుడు పరిస్థితి మరింత హీటెక్కుతుంది. జనాలు టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతారు. అందుకే ఒక వారం రోజులు వెనక్కి వెళ్తే మంచిదని 'ఇస్మార్ట్ శంకర్' టీమ్ నిర్ణయం తీసుకుంది.

జూలై 18న గురువారం నాడు సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే అదే సమయానికి విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' సినిమా రిలీజ్ కి ఉంది. ప్రేక్షకుల్లో  విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఆ విధంగా చూసుకుంటే 'ఇస్మార్ట్ శంకర్' సినిమా కలెక్షన్లపై ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. మరేం చేస్తారో చూడాలి!