Asianet News TeluguAsianet News Telugu

పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ కి ఘెర అవమానం

 సర్ఫరాజ్ తన కుటుంబసభ్యులతో కలిసి షాపింగ్ కి వెళ్లారు. అక్కడ ఓ అభిమాని సర్ఫరాజ్ ని సెల్ఫీ అడిగాడు. దీనికి సర్ఫరాజ్‌ సైతం అంగీకరించాడు. కానీ అతని కొడుకు ఏడుస్తుండటంతో పక్కకు వెళ్లిపోయాడు. దీంతో ఆ అభిమాని పాక్‌ కెప్టెన్‌ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడు. 

Sarfaraz Ahmed Abused and Fat-Shamed While Out Shopping With Kid, His Response Wins Over Internet
Author
Hyderabad, First Published Jun 22, 2019, 9:56 AM IST

పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ కి ఘోర అవమానం ఎదురైంది.ఇటీవల భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ ఘెరంగా ఓటమిపాలైంది. ఈ ఘటన ఆదేశ క్రికెట్ అభిమానులను ఎంతగానో కలవరపరిచింది. జట్టు ఓటమికి కెప్టెన్ సర్ఫరాజ్ ని కారకుడిని చేస్తూ...ఇప్పటికే నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. తాజాగా ఓ అభిమాని సర్ఫరాజ్ ని ఘెరంగా అవమానించాడు. 

ఇటీవల సర్ఫరాజ్ తన కుటుంబసభ్యులతో కలిసి షాపింగ్ కి వెళ్లారు. అక్కడ ఓ అభిమాని సర్ఫరాజ్ ని సెల్ఫీ అడిగాడు. దీనికి సర్ఫరాజ్‌ సైతం అంగీకరించాడు. కానీ అతని కొడుకు ఏడుస్తుండటంతో పక్కకు వెళ్లిపోయాడు. దీంతో ఆ అభిమాని పాక్‌ కెప్టెన్‌ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడు. 

‘సర్ఫరాజ్‌ బాయ్‌.. ఎందుకిలా పందిలా బలిసావు. కొంచెం డైట్‌ చేయవచ్చు కదా’  అంటూ అభ్యంతరకర పదజాలం వాడాడు. అయినా సర్ఫరాజ్‌ ఏ మాత్రం ఆగ్రహానికి గురవ్వకుండా ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుండగా.. నెటిజన్లు ఆ అభిమాని చర్యను తప్పుపట్టారు

 . ఒక ఫ్రొఫెషనల్‌ ఆటగాడి పట్ల అలా ప్రవర్తించడం సిగ్గుమాలిన చర్యని ఒకరు.. ‘నీవు చేసే 9-5 ఉద్యోగంలో ఏదో తప్పిదం చేస్తే.. అప్పుడు జనాలంతా రోడ్లపై నిన్ను ఇలానే అవమానపరిస్తే తట్టుకుంటావా? అని మరొకరు ప్రశ్నించారు. తప్పులు సహజమని, ఓ ఆటగాడి పట్ల దురుసుగా ప్రవర్తించడం ఆహ్వానించదగిన విషయం కాదని అభిప్రాయపడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios