చంద్రబాబుకు భారీ ముప్పు: మరిన్ని...

By rajesh yFirst Published Jun 21, 2019, 6:14 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం
 

బీజేపీలోకి మరో ఇద్దరు టీడీపీ నేతలు: సుజనా రాయబారాలు

ప్రకాశం జిల్లాకు చెందిన నేతలు సుజనాతో టచ్‌లోకి వెళ్లినట్టుగా చెబుతున్నారు. వారం రోజుల క్రితం  మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి తో ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మెన్ ఈదర హరిబాబు సమావేశమయ్యారు. హరిబాబు బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.
 

కోడెలకు టీడీపీ సహాయ నిరాకరణ: బిజెపిలోకి ఫిరాయింపులకు అదీ కారణమే...

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. రాజకీయ భవిష్యత్, కేసుల నుంచి ఎదుర్కోవడం, ఇలాంటి కారణాలు ఒక ఎత్తు అయితే మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎపిసోడ్ మరోకారణమని తెలుస్తోంది. 
 

జగన్ ఎఫెక్ట్: ఒత్తిడితోనే బిజెపిలోకి సుజనా, సిఎం రమేష్

రెండు చోట్ల అధికారానికి దూరంగా ఉండటంతో కేసులు తమను ఎక్కడ చుట్టుముట్టుతాయనో ఆందోళన చెందిన ఆ నేతలు తొందరగా మేల్కొన్నారని తెలుస్తోంది. ఒకవేళ టీడీపీలోనే కొనసాగిన భవిష్యత్ లో కేసులు ఎదుర్కోవాలంటే కేంద్రంతో సఖ్యత ఉండాలని భావించారు. 
 

టీడీపీ ఎంపీల విలీనానికి వెంకయ్య ఆమోదం

రాజ్యసభలో టీడీపీకి ఆరుగురు ఎంపీలు ఉన్నారు. ఆరుగురు ఎంపీల్లో  సుజనా చౌదరి, టీజీ వెంకటేష్,  సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావులు‌ టీడీపీపీని బీజేపీలో విలీనం చేయాలని గురువారం నాడు లేఖ ఇచ్చారు. ఈ లేఖ ఆధారంగా  టీడీపీపీని బీజేపీలో విలీనం చేయడానికి ఆమోదం తెలిపారు.
 

విజయసాయితో సుజనా, సీఎం రమేష్... ఫోటోలు వైరల్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లిన సమయంలో.. రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేష్ లు బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  వీరు బీజేపీలోకి వెళ్లడంతో టీడీపీ ఖాళీ అయ్యిందని కొందరు అభిప్రాయపడుతుంటే... చంద్రబాబే పథకం ప్రకారం వారిని బీజేపీలోకి పంపించారనే వాదనలు కూడా వినిపించాయి. 

టీడీపీలో ముసలం: బాబు... బ్రహ్మానందంగా మారారంటూ వర్మ సెటైర్లు

తెలుగు దేశం పార్టీ ఎంపీలు బీజేపీలో చేరడం, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ట్వీట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీలో బాబు గారు బ్రహ్మానందం అయిపోయారంటూ సెటైర్లు వేశారు.
 

పవన్ పై ఆకుల షాకింగ్ కామెంట్స్

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ నేత ఆకుల సత్యానారయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చే ఐదేళ్లలో రాజకీయాల్లో ఉంటారో లేదో చెప్పడం కష్టమని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలుపొందారు. కనీసం పార్టీ అధినేత పవన్ కూడా గెలుపొందలేదు. దీంతో.. చాలా మంది నేతలు అధికార పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
 

బిజెపి షరతు: అందుకే జగన్ వెనక్కి, టీడీపి నేతలకు వల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తుడిచిపెట్టేసి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే వూహరచనలో భాగంగానే బిజెపి తెలుగుదేశం పార్టీ నేతలకు వల వేసినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలను వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలోకి తీసుకోవద్దని బిజెపి నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు షరతు పెట్టినట్లు చెబుతున్నారు. దాంతో జగన్ వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు. 
 

చంద్రబాబుకు మరో ముప్పు: అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా గల్లంతు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని తిరుగులేని దెబ్బ తీయాలనే వ్యూహరచనలో బిజెపి ఉంది. తన వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి పూనుకుంది.
 

కోట్ల కుటుంబానికి గాలం: బిజెపి బంపర్ ఆఫర్

కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి కుటుంబాన్ని బీజేపీలో చేర్చుకోవడానికి రాం మాధవ్ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యత్వం లేదా కేబినేట్‌ హోదా కలిగిన నామినేటెడ్‌ పదవిని ఆశ చూపుతున్నట్లు తెలుస్తోంది. 
 

ఏపీ టీడీపీలోని పరిణామాలు టీఆర్ఎస్ కు భవిష్యత్ సంకేతం: విజయశాంతి

తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచారక కమిటీ చైర్మన్ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ టీడీపీలోని పరిణామాలు తెలంగాణలోని టీఆర్ఎస్ కు తప్పనిసరి భవిష్యత్ సంకేతంగా ప్రజాస్వామ్య వాదులు అభిప్రాయపడుతున్నారని స్పష్టం చేశారు. 
 

9 నెలల చిన్నారిపై రేప్, హత్య: ప్రవీణ్ ఫోన్లో నీలి చిత్రాలు?

9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు ప్రవీణ్ ఫోన్‌లో  అశ్లీల చిత్రాలు ఉన్నట్టుగా పోలీసులు  అనుమానిస్తున్నారు. ఈ ఫోన్‌ను స్వాధీనం చేసుకొనేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
 

కాళేశ్వరం ప్రాజెక్టుపై రవితేజ ట్వీట్.. నెటిజన్ల షాక్


‘‘కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిస్సందేహంగా ఇంజినీర్ ప్రతిభే. తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ సీఎంవోకి అభినందనలు. తెలంగాణ ప్రజల కలను నిజం చేసిన వారందరికీ దన్యావాదాలు’’ అని రవితేజ ట్వీట్ చేశారు. 
 

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి హరీష్ దూరం: కారణమదేనా

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం కార్యక్రమానికి హరీష్ రావు దూరంగా ఉన్నారు. శుక్రవారం నాడు సిద్దిపేటలోనే పలు కార్యక్రమాల్లో హరీష్ రావు పాల్గొన్నారు. సిద్దిపేటలో జరిగిన యోగ దినోత్సవం పాటు జయశంకర్ వర్థంతి కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు.
 

కాళేశ్వరం ప్రారంభోత్సవం: కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ హరీశ్ ట్వీట్

హరీశ్ రావు ట్వీట్టర్‌ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా అభివర్ణించిన ఆయన... ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర కృషి వల్లే కాళేశ్వరం త్వరగా పూర్తయ్యిందని అభిప్రాయపడ్డారు. 
 

అమ్మాయిలకు అదాశర్మ స్వీట్ వార్నింగ్!

హార్ట్ ఎటాక్' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ముద్దుగుమ్మ అదాశర్మ. తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకి సరైన గుర్తింపు రాలేదు. సినిమాలలో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటుంది.
 

'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' రివ్యూ

"మీరంతా చూస్తారు, నేను పరిశీలిస్తాను" అంటాడు షెర్లాక్ హోమ్స్ . "సౌమిత్రీ, నేను క్లయింటుని నీలా భయ పెట్ట దలచుకోలేదు. మెల్ల మెల్లగా కేసు లోకి దించుతాను" అంటాడు చంటబ్బాయి (చిరంజీవి).

 

అమలాపాల్ న్యూడ్ సీన్లకు సెన్సార్ షాక్!

తమిళ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అమలాపాల్ ప్రస్తుతం 'ఆడై' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను తెలుగులో 'ఆమె' అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైసెన్సేషనల్ అయింది.
 

ఆమె క్లీవేజ్ షో ఏమైనా చేసిందా..? రష్మి ఫైర్!

వరంగల్ హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నపాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన గురించి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తిని నడిరోడ్డులో ఉరితీయాలని నినాదాలు చేస్తున్నారు.
 

రహస్య నిశ్చితార్ధంపై రెజీనా కామెంట్!

ప్రముఖ నటి రెజీనా రహస్యంగా నిశ్చితార్ధం చేసుకున్నట్లు కోలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. తమిళనాడుకి చెందిన ఓ నేషనల్ మ్యాగజైన్ రెజీనా నిశ్చితార్ధం గురించి వార్తలు ప్రచురించడంతో ఇది కాస్త వైరల్ అయింది.
 

పవన్ గెడ్డం తీయడానికి అసలు కారణం ఇదేనా?

ఎలక్షన్స్  ముందు వరకు తెల్ల పంచె, తెల్ల లాల్చీ, గెడ్డంలో కనిపించారు  పవన్‌ కళ్యాణ్. ఆ తరువాత జీన్స్‌ టీషర్ట్స్‌లోకి మారారు.  తాజాగా గెడ్డం కూడా ట్రిమ్‌ చేసి స్టైలిష్ లుక్‌లోకి వచ్చేశారు. 
 

రాజశేఖర్ ‘కల్కి’ కథ కాపీ వివాదం!

రాజశేఖర్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కల్కి’. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా కంప్లీటైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు. ప్రమోషన్స్ పై దృష్టి పెడుతున్నారు. మరో ప్రక్క కల్కి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం ఊపందుకుంది.
 

విజయ్ శంకర్ కు గాయంపై బుమ్రా వివరణ... ఆ యార్కర్ వల్లే

యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా బౌలింగ్ లో ప్రాక్టీస్ చేస్తుండగా ఈ గాయమైంది. బుమ్రా వేసిన యార్కర్ ను శంకర్ అంచనావేయలేకపోవడంతో ఆ బంతి  నేరుగా వెళ్లి అతడి కాలికి తాకింది. దీంతో నెట్స్ లోనే కుప్పకూలిన నొప్పితో విలవిల్లాడిపోయిన అతడికి టీమిండియా వైద్యబృందం ప్రథమ చికిత్స అందించారు. 
 

టీ20లో సంచలనం: టార్గెట్ 314 పరుగులు, పదికే ప్రత్యర్థి అలౌట్

300 స్కోర్ల చేయడం వన్డేల్లో సాధ్యమే.. గతంలో 400 పైచిలుకు స్కోర్లు చేయడం కూడా చూశాం. అయితే కేవలం 20 ఓవర్లు మాత్రమే ఉండే టీ20లలో 300 పరుగుల స్కోరు అన్నది ఊహించడం కూడా కష్టమే

click me!