తెలంగాణ ప్రజలు దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కల నేడు నెరవేరింది.  శుక్రవారం ఈ ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి, జగన్, మహా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ లు కూడా హాజరయ్యారు. కాగా..ఈ ప్రాజెక్టుపై సినీ హీరో రవితేజ ప్రశంసలు కురిపించారు. 

‘‘కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిస్సందేహంగా ఇంజినీర్ ప్రతిభే. తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ సీఎంవోకి అభినందనలు. తెలంగాణ ప్రజల కలను నిజం చేసిన వారందరికీ దన్యావాదాలు’’ అని రవితేజ ట్వీట్ చేశారు. 

అయితే.. ఈ ట్వీట్ కి అభిమానుల నుంచి భిన్నమైన స్పందన వస్తోంది. కొందరు రవితేజ ట్వీట్ కి మద్దుతగా స్పందిస్తే.. ఇంకొందరు మాత్రం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి హరీష్ రావు ఎంతో కష్టపడ్డాడని.. ఆయన పేరు కనీసం మీరు ప్రస్తావించలేదంటూ రవితేజపై మండిపడుతున్నారు. ఇంకొంతమంది మాత్రం డ్రగ్స్ కేసు క్లోజ్ చేశారు కదా.. ఇంకా ఎందుకు కాకా పడుతున్నావు అన్న అర్థం వచ్చేలా ట్వీట్లు చేయడం గమనార్హం.