తమిళ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అమలాపాల్ ప్రస్తుతం 'ఆడై' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను తెలుగులో 'ఆమె' అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైసెన్సేషనల్ అయింది.

దానికి కారణం టీజర్ లో అమలాపాల్ న్యూడ్ గా కనిపించడమే.. ఒంటి మీద నూలుపోగు లేకుండా ఆమె నటించింది. దీంతో టీజర్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఒక స్టార్ హీరోయిన్ ఇలాంటి సన్నివేశాల్లో నటించడంతో సినిమాకు హైప్ వచ్చేసింది. ఆడియన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టీజర్ లోనే అమలాఇంత బోల్డ్ గా కనిపించిందంటే.. ఇక సినిమాలో ఇంకెలా ఉంటుందోననే ఆసక్తి కుర్రాళ్లలో పెరిగింది. అయితే వారు ఆశిస్తున్నట్లుగా సినిమాలో అన్ని బోల్డ్ సీన్లు ఉండవని సమాచారం. సినిమాలో బోల్డ్ సీన్స్ అన్నింటికీ సెన్సార్ కత్తెర వేయడానికి సిద్ధమవుతోంది. కొన్ని ట్రిక్స్ వాడి టీజర్ లో అమలాని న్యూడ్ చూపించారనే అభిప్రాయాలు  వ్యక్తమవుతున్నాయి.

అయితే సినిమాలో ఇలానే కొన్ని సన్నివేశాలు ఉంటాయట. అయితే వాటిని చూపించడానికి సెన్సార్ నో చెబుతోందట. ఈ సన్నివేశాలన్నింటినీ బ్లర్ చేసి చూపిస్తారట. లేదంటే సన్నివేశాలు తీసేయాల్సిన పరిస్థితి ఉందట. దీంతో దర్శకనిర్మాతలకు వేరే దారి లేదని తెలుస్తోంది. కాబట్టి సినిమాలో అమలాని అంత బోల్డ్ గా చూసే ఛాన్స్ లేకపోవచ్చు.