Asianet News TeluguAsianet News Telugu

రాజశేఖర్ ‘కల్కి’ కథ కాపీ వివాదం!

ఈ మధ్య తెలుగు,తమిళ చిత్ర పరిశ్రమలోనూ కథల కాపీ వివాదాలు ఎక్కువైపోయాయి. 

Rajashekar's Kalki movie Copy issue
Author
Hyderabad, First Published Jun 21, 2019, 9:11 AM IST

ఈ మధ్య తెలుగు,తమిళ చిత్ర పరిశ్రమలోనూ కథల కాపీ వివాదాలు ఎక్కువైపోయాయి. పెద్ద హీరోల కే కాదు ఓ మాదిరి హీరోల సినిమాలకు సైతం ఈ వివాదాలు వెంటాడుతున్నాయి. సరిగ్గా రిలీజ్ కు ముందు ఇవి మీడియా ముందు ప్రత్యక్ష్యమవుతాయి. అప్పటిదాకా రైటర్స్ అశోశియేషన్ తో ఫైట్ చేసి అక్కడ తేలక లేక రిలీజ్ అయ్యిపోతే చేసేదేమీ ఉండదనో మీడియాకు ఎక్కుతున్నారు. ఇప్పుడు రాజశేఖర్ తాజా చిత్రం కల్కి కి  కూడా అలాంటి సమస్య వచ్చింది. 

రాజశేఖర్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కల్కి’. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా కంప్లీటైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు. ప్రమోషన్స్ పై దృష్టి పెడుతున్నారు. మరో ప్రక్క కల్కి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం ఊపందుకుంది.

ఈ నేపధ్యంలో కల్కి సినిమా కథ తనదే అంటూ మీడియాకు ఎక్కారు కార్తికేయ అలియాస్ ప్రసాద్ అనే రచయిత. ఆయన గతంలో రాజశేఖర్ తో మహంకాళి అనే సినిమా చేసారు. ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. ఆ సమయంలోనే తాను కల్కి టైటిల్ తో కథ చెప్పానని, స్క్రిప్ట్ కాపీ కూడా ఇచ్చానని అంటున్నారు. 

అయితే అప్పుడు ఎక్కువ బడ్జెట్ అవుతుందని, ఇప్పుడు చేయలేమని   చెప్పారని తెలిపారు. దాంతో తాను ఆ మ్యాటర్ వదిలేసి, తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నానని అన్నారు.  అయితే ఇప్పుడు  అదే కథను చిన్న చిన్న మార్పులు చేసి సినిమాగా తీసేసారని తనకు తెలిసిందని  కార్తికేయ  అంటున్నారు.

ఇక ఈ విషయమై తెలుగు సినీ  రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసానని, తన కథ అసోసియేషన్ లో 2009లో రిజిస్టర్ అయిందని,ఆధారాలతో సహా ఉందని అన్నారు. అసోసియేషన్ చెందిన కమిటి...కల్కి యూనిట్ ను చర్చలకు పిలిచిందని, వాళ్లు రాకుండా టైమ్ గడిపేస్తున్నారని అన్నారు. 

అలాగే ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సి కళ్యాణ్ కూడా పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. తాము ఓ వెబ్ సైట్ లో కథ కొన్నామని కల్కి యూనిట్ చెప్తూ... లింక్ పంపారట. కానీ ఆ లింక్ క్లిక్ చేస్తే, అక్కడ ఏమీ లేదని చెప్పుకొచ్చారు. మరి ఈ వివాదం ఎంతదూరం వెళ్తుందో చూడాలి.


 

Follow Us:
Download App:
  • android
  • ios