తెలుగు దేశం పార్టీ ఎంపీలు బీజేపీలో చేరడం, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ట్వీట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీలో బాబు గారు బ్రహ్మానందం అయిపోయారంటూ సెటైర్లు వేశారు.

ఎన్టీఆర్ విదేశాల్లో వున్నప్పుడు నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిస్తే.. ఇప్పుడు చంద్రబాబు విదేశాల్లో ఉండగా టీడీపీ నేతలు ఆయనకు వెన్నుపోటు పొడిచారని వర్మ ఎద్దేవా చేశారు.

దీనిని బట్టి చరిత్ర ఎప్పుడూ పునరావృతం అవుతుందని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో బాబు మాట్లాడినప్పుడల్లా జగన్ నవ్వు ఆపుకోలేకపోతున్నారు. దీని అర్ధం చంద్రబాబు.. అసెంబ్లీలో బ్రహ్మానందంగా మారిపోయారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.