'హార్ట్ ఎటాక్' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ముద్దుగుమ్మ అదాశర్మ. తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకి సరైన గుర్తింపు రాలేదు. సినిమాలలో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం సిద్ధమవుతోంది. 'ది హాలిడే' అనే పేరుతో రూపొందించనున్న ఈ సిరీస్ కోసం అదాశర్మ సరికొత్త హెయిర్ స్టైల్ ని ట్రై చేసింది. తన జుట్టుకి మూడు రకాల రంగులతో డై వేసింది.

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ హెయిర్ స్టైల్అదాశర్మకి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. దాంతో ఆమె ఆ హెయిర్ స్టైల్ కాపీ రైట్స్ తనవేనంటూ సరదాగా పోస్ట్ చేసింది.

తాను 'ది హాలిడే' సిరీస్ కోసం చేసుకున్న హెయిర్ స్టైల్ అని, అమ్మాయిలూ దీన్ని ట్రై చేయకూడదని.. ఈ హెయిర్ స్టైల్ పై పూర్తి కాపీ రైట్స్ తనవేనంటూ సోషల్ మీడియాలో అమ్మాయిలకు స్వీట్ గా వార్నింగ్ ఇచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ తోనైనా అదా సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం!