హన్మకొండ:9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు ప్రవీణ్ ఫోన్‌లో  అశ్లీల చిత్రాలు ఉన్నట్టుగా పోలీసులు  అనుమానిస్తున్నారు. ఈ ఫోన్‌ను స్వాధీనం చేసుకొనేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

రెండు రోజుల క్రితం హన్మకొండలో డాబాపై కుటుంబసభ్యుల వద్ద పడుకొన్న 9 మాసాల చిన్నారిని కిడ్నాప్ చేసిన ప్రవీణ్ ఆ బాలికపై అత్యాచారం చేసి  హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు..

ప్రవీణ్‌ వాడే సెల్‌ఫోన్‌లో పెద్దఎత్తున నీలి చిత్రాలు ఉండేవని, వాటిని చూస్తూ లీనమైపోయేవాడని అతనితో హోటల్‌లో పనిచేసే కార్మికులు పోలీసులకు తెలి పినట్టు సమాచారం.

ప్రవీణ్ ఫోన్‌లో నీలి చిత్రాలే ఉన్నాయా? ఇంకా ఏమైనా ఉన్నా యా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రవీ ణ్‌కు రాత్రి సమయాల్లో మహిళల పట్ల అసభ్యం గా ప్రవర్తించే అలవాటు ఉండడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రవీణ్ నుండి రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ రెండు ఫోన్లు కూడ చోరీ చేసిన ఫోన్లుగా పోలీసులు గుర్తించారు. మరో వైపు పోలీసులకు దొరికే సమయంలో ప్రవీణ్ తన వద్ద ఉన్న ఫోన్ ను మురుగు కాల్వలో పారేసినట్టుగా పోలీసులు గుర్తించారు.  

 అయితే నిందితుడిని తమకు అప్పగించాలని పోలీసులను మహిళా సంఘాలు, బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో బుధవారం రాత్రి 12 గంటలకు నిందితుడిని వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు.

చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ప్రవీణ్‌కు దేహశుద్ది చేయాలని సెంట్రల్ జైలులోని ఖైదీలు ప్లాన్ చేసినట్టుగా ప్రచారం సాగింది.ఈ విషయాన్ని గమనించిన జైలు అధికారులు జాగ్రత్తలు తీసుకొన్నారు. 

అత్యంత కరుడుగట్టిన నేరస్తులను ఉంచే హై సెక్యూరిటీ బ్యారక్‌లో నిందితుడిని ఉంచారని తెలిసింది.మద్యం మత్తులో చిన్నారిని ఎత్తుకెళ్లినట్టుగా నిందితుడు జైలు అధికారులకు చెప్పారని సమాచారం.