ప్రముఖ నటి రెజీనా రహస్యంగా నిశ్చితార్ధం చేసుకున్నట్లు కోలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. తమిళనాడుకి చెందిన ఓ నేషనల్ మ్యాగజైన్ రెజీనా నిశ్చితార్ధం గురించి వార్తలు ప్రచురించడంతో ఇది కాస్త వైరల్ అయింది.

ఈ నెల 13న చెన్నైలో కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో రెజీనా రహస్యంగా నిశ్చితార్ధం చేసుకుందని రాసుకొచ్చారు. ఈ ఏడాది చివర్లో పెళ్లి కూడా చేసుకోబోతుందని అన్నారు. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎట్టకేలకు రెజీనా స్పందించింది.

ఈ వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పింది. అసలు ఇలాంటి వార్తలు ఎక్కడ నుండి పుట్టుకొస్తాయో అర్ధం కాదని, ఇలాంటివి విన్నప్పుడు చాలా చిరాకేస్తుందని.. తనకు నిజంగా పెళ్లి ఆలోచన వస్తే స్వయంగా ప్రకటిస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో 'కసడదబర'తో పాటు తెలుగులో 'ఎవరు' చిత్రంలో నటిస్తోంది.