వరంగల్ హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నపాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన గురించి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తిని నడిరోడ్డులో ఉరితీయాలని నినాదాలు చేస్తున్నారు.

తాజాగా యాంకర్ రష్మి కూడా ఈ విషయంపై స్పందించింది. ఏం చేసిందని 9 నెలల చిన్నాపై విధి కక్షకట్టిందని వాపోయింది. ''ఆమె బట్టలు అసభ్యకరంగా ఏమైనా వేసుకుందా..? ఆమె క్లీవేజ్ షో ఏమైనా చేసిందా..? ఆమె తన కాళ్లను ఏమైనా చూపించిందా..? ఆమె తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పిందా..? ఏం చేసింది ఆమె'' అంటూ ప్రశ్నించింది.

రష్మి ట్వీట్ చూసిన నెటిజన్లు.. సదరు వ్యక్తిని పబ్లిక్ లో ముక్కలు ముక్కలుగా నరికేయాలని. అలాంటి వాళ్లు సమాజంలో ఉండకూడదని కామెంట్స్ చేస్తున్నారు.