తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.

12:20 AM (IST) Jul 25
Andhra Pradesh cabinet: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 50వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు రహదారుల అభివృద్ధికి రూ.1,000 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.
11:24 PM (IST) Jul 24
Sravana masam: శ్రావణ మాసంలో మాంసాహారం తినకూడదని చెబుతారు. దీని వెనుక మతపరమైన విషయాలతో పాటు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
10:23 PM (IST) Jul 24
రియల్‌మీ నార్జో 80 లైట్ 4G ఫోన్ భారతదేశంలో లాంచ్ అయ్యింది. దీని బ్యాటరీ సామర్థ్య ఆకట్టుకునేలా ఉంది. ఫుల్ చార్జ్ చేస్తే ఎన్నిరోజులు నాన్ స్టాప్ గా వాడొచ్చో తెలుసా?
10:08 PM (IST) Jul 24
Hulk Hogan: రెజ్లింగ్ స్టార్, WWE కింగ్ హల్క్ హోగన్ గుండెపోటుతో మృతి చెందారు. ఫ్లోరిడాలోని ఆయన నివాసంలో 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
09:40 PM (IST) Jul 24
మందు ఫుల్ బాటిల్ అంటే 750 మిల్లీ లీటర్లే ఎందుకుంటుంది? ఎందుకీ పరిమాణం స్థిరంగా ఉంది? దీనికి సంబంధించిన ఫ్రెంచ్ వైన్ సంస్కృతి, అమెరికా గ్యాలన్ ప్రమాణాలు వంటి ఆసక్తికర కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకోండి.
09:08 PM (IST) Jul 24
ITR Filing 2025: 2024-25 ఐటీఆర్ ఫైలింగ్ గడువును ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. ఆలస్యం చేస్తే భారీ జరిమానా తప్పదు. బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆ వివరాలు మీకోసం.
07:32 PM (IST) Jul 24
India UK Trade Deal: భారత్-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ తో భారత్ లో పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ ఒప్పందంతో ధరలు తగ్గే వస్తువులు, భారత్ కు కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
07:06 PM (IST) Jul 24
8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర చర్యలు చేపట్టింది. తాజాగా పార్లమెంట్ వేదికన ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో వేతనసంఘం ముందు కొన్ని డిమాండ్లను ఉంచేందుకు ఉద్యోగులు కూడా సిద్దమయ్యారు. మరి 8వ వేతనసంఘం గుడ్ న్యూస్ చెబుతుందా?
05:17 PM (IST) Jul 24
మొన్న ఇండియాలో పెట్టుబడులు వద్దన్నాడు… ఇప్పుడేమో అసలు ఇండియన్స్ కి అసలు ఉద్యోగాలే ఇవ్వొద్దంటున్నాడు… ఏమయ్యా ట్రంప్… భారతీయులు నీకు ఏం ద్రోహం చేసారని ఇలా తగులుకున్నావ్..!
04:46 PM (IST) Jul 24
Rishabh Pant: ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో భాగంగా మాంచెస్టర్ లో నాల్గో టెస్టులో భారత్ తలపడుతోంది. మొదటి రోజు గాయంతో గ్రౌండ్ ను వీడిన రిషబ్ పంత్ పై బీసీసీఐ బిగ్ అప్డేట్ ఇచ్చింది.
04:45 PM (IST) Jul 24
ఎంతటి నేరస్థుడైనా సరే చిన్న తప్పుతో దొరికిపోతుంటాడు. తాజాగా కర్ణాటకలో ఇలాంటి ఓ ఉదంతమే వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.
04:13 PM (IST) Jul 24
Rishabh Pant: ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ నుంచి భారత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. ఇది భారత్ కు గట్టి ఎదురుబెబ్బ అని చెప్పవచ్చు.
03:44 PM (IST) Jul 24
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చింది. వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ పేరుతో లాంచ్ చేసిన ఈ ట్యాబ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
02:56 PM (IST) Jul 24
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే..
02:33 PM (IST) Jul 24
బంగారం ధరలో విచిత్రమైన మార్పులు కనిపిస్తున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు గురువారం తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం గోల్డ్ ధర ఎలా ఉందంటే.
02:06 PM (IST) Jul 24
ప్రముఖ యూపీఐ పేమెంట్ సంస్థ ఫోన్‌పే మరో ముందడుగు వేసింది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐతో కలిసి కొత్త క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
01:55 PM (IST) Jul 24
60 ఏళ్లపాటు భారత వాయుసేనలో సేవలందించిన మిగ్-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలికే సమయం దగ్గపడింది. మరో రెండునెలలో అంటే సెప్టెంబర్ 19న చండీగఢ్ ఎయిర్‌బేస్‌లో ఈ ఫైటర్ జెట్ ఫెయిర్‌వెల్ వేడుక జరగనుంది.
01:03 PM (IST) Jul 24
భారత్, అమెరికా సంయుక్తంగా నిసార్ అనే శక్తివంతమైన శాటిలైట్‌ను ప్రయోగించనుంది. జూలై 30న ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఇంతకీ మిషన్ ప్రత్యేకత ఏంటి? ఈ ఉపగ్రహం అందించే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
12:03 PM (IST) Jul 24
ఇటీవల జరుగుతోన్న విమాన ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎయిర్ ఇండియా ప్రమాదం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. కాగా రష్యాలో 50 మందితో వెళ్తున్న ఓ విమానం అదృశ్యమైందన్న వార్త ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది.
11:33 AM (IST) Jul 24
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ వ్యవహారం సంచలనం రేపుతోంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇంతకీ ఏంటీ లిక్కర్ స్కామ్.? ఇప్పటి వరకు ఏం జరిగింది.? లాంటి పూర్తి వివరాలు..
09:58 AM (IST) Jul 24
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళ సంక్షేమం కోసం పథకాలను తీసుకొస్తోంది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
09:44 AM (IST) Jul 24
హిందూ దేవతలతో ప్రభుత్వం ఉంటే ఎలా ఉంటుంది? ఓ డ్రైవర్ చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకూ ఏ దేవుడు ఈ మంత్రిత్వ శాఖకు సరిపోతారో తెలుసా?