MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • AP Cabinet: తళతళ మెరిసిపోనున్న ఆంధ్ర‌ రోడ్లు... డేటా సెంటర్, ఐటీ హబ్, కొత్త రోడ్లు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణ‌యాలు

AP Cabinet: తళతళ మెరిసిపోనున్న ఆంధ్ర‌ రోడ్లు... డేటా సెంటర్, ఐటీ హబ్, కొత్త రోడ్లు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణ‌యాలు

Andhra Pradesh cabinet: ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 50వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెల‌ప‌డంతో పాటు రహదారుల అభివృద్ధికి రూ.1,000 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం ల‌భించింది.

3 Min read
Mahesh Rajamoni
Published : Jul 25 2025, 12:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెట్టుబడులకు కేంద్రంగా మారుతోన్న ఆంధ్రప్రదేశ్
Image Credit : Getty

పెట్టుబడులకు కేంద్రంగా మారుతోన్న ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తోందని ప్ర‌భుత్వం పేర్కొంది. దీనికి అనుగుణంగా తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక పాలసీని రూపొందించి మంత్రివర్గం ఆమోదించింది. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహానికి తలుపులు తెరచనున్నాయి.

మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించిన వివరాల ప్రకారం, ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విధానం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పరిశ్రమలకు పలు రకాల ప్రోత్సాహకాలు లభిస్తాయని తెలిపారు. దేశంలో ఇప్పటికే గుజరాత్, తమిళనాడు, యూపీ లాంటి రాష్ట్రాలు ఈ విధానాలతో గొప్ప ఫలితాలు సాధించగా, ఇక ఏపీ కూడా అదే దారిలో ముందుకెళ్లనుంది.

ఒక్క కేబినెట్ మీటింగ్‌లో రూ.80 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం. వీటి ద్వారా 1.25 లక్షల మందికి ఉపాధి లభించనుంది. #IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradeshpic.twitter.com/MSifaDdq1v

— Telugu Desam Party (@JaiTDP) July 24, 2025

25
విశాఖపట్నంలో భారీ పెట్టుబడులు
Image Credit : X/JaiTDP

విశాఖపట్నంలో భారీ పెట్టుబడులు

ఈ సమావేశంలో 50వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా విశాఖ న‌గ‌రాన్ని ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయడానికి కంపెనీలు ముందుకు రావడముతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. ప్రముఖ డేటా సేవల సంస్థ ‘సిఫి’ విశాఖలో రూ.16,466 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.

ఈ ప్రాజెక్టుకు అవసరమైన 3.6 ఎకరాల భూమిని మధురవాడలో కేటాయించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా పరదేశిపాలెంలో సిఫి సంస్థకు 50 ఎకరాలు కేటాయించనున్నారు. పీనం పీపుల్ అనే సంస్థ కూడా 4.45 ఎకరాల్లో 207 కోట్ల రూపాయలతో పరిశ్రమను ఏర్పాటు చేయనుంది.

పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ నిలిచేలా కేబినెట్ నిర్ణయాలు. విశాఖలో సిఫీ సంస్థ ఏర్పాటుకు ఆమోదం. రూ.16,466 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న సిఫీ.#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradeshpic.twitter.com/xIVSOij2nM

— Telugu Desam Party (@JaiTDP) July 24, 2025

Related Articles

Related image1
Sravana Masam: శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఎందుకు తినకూడదు?
Related image2
ITR Filing 2025: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంపు.. పెనాల్టీ, బెనిఫిట్స్ ఇవే
35
ఆంధ్రప్రదేశ్ రోడ్ల అభివృద్ధికి రూ.1,000 కోట్లు
Image Credit : Getty

ఆంధ్రప్రదేశ్ రోడ్ల అభివృద్ధికి రూ.1,000 కోట్లు

రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధి, మరమ్మతులపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. రూ.1,000 కోట్లతో 2,000 కిలోమీటర్ల మేర కొత్త రహదారులను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. మరో రూ.500 కోట్లతో ఇప్పటికే ఉన్న రోడ్లను వర్షాకాలంలో మరమ్మతులు చేయాలని నిర్ణయించారు.

రాష్ట్రంలోని రహదారులు జాతీయ ప్రమాణాలకు సమంగా ఉండాలన్నదే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంద‌ని తెలిపారు. ఇందుకోసం ప్రతి రహదారిపై సీసీ కెమెరాలు, ఆన్‌లైన్ ట్రాకింగ్ వంటి ఆధునిక పద్ధతులను అమలు చేయనున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

రూ.1,000 కోట్లతో 2,000 కి.మీ. కొత్త రోడ్ల నిర్మాణం.

మరో రూ.500 కోట్లతో రహదారులకు మరమ్మత్తులు

రోడ్ల స్థితిగతులు-తీసుకోవాల్సిన చర్యలపై 15 రోజుల్లో సమగ్ర నివేదిక

వాహనాల రద్దీ తెలిసేలా ప్రతీ 50 కి.మీ.కు సీసీ కెమేరా ఏర్పాటు.

రహదారులు భవనాల శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం.… pic.twitter.com/szYIBoco71

— Telugu Stride (@TeluguStride) July 24, 2025

45
పీపీపీ విధానంలో హైవే అభివృద్ధికి ప్రణాళికలు
Image Credit : Getty

పీపీపీ విధానంలో హైవే అభివృద్ధికి ప్రణాళికలు

రాష్ట్రంలోని 12,653 కిలోమీటర్ల హైవేల్లో 20 కి.మీ కన్నా పొడవైన 10,200 కి.మీ రోడ్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫేజ్ 1, ఫేజ్ 2 అనే రెండు దశల్లో ఈ రహదారుల అభివృద్ధి జరగనుంది. ఈ క్రమంలో అత్యధిక రద్దీ గల 1,332 కి.మీ రహదారులను ఫేజ్ 1A కింద చేపట్టనున్నారు.

ఇవన్నీ పూర్తయితే రాష్ట్రంలో కనీసం మరో 10,000 కి.మీ అధునాతన రహదారులు అందుబాటులోకి రానున్నాయి. ఇది రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు బూస్టు గా ఉంటుంద‌ని అధికార వ‌ర్గాలు భావిస్తున్నాయి.

55
రాష్ట్రాభివృద్ధికి మళ్ళీ సింగపూర్‌తో సంబంధాలు
Image Credit : ANI

రాష్ట్రాభివృద్ధికి మళ్ళీ సింగపూర్‌తో సంబంధాలు

కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో సింగపూర్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయని అన్నారు. ఇప్పుడు వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. తన సింగూర్ పర్యటన ద్వారా రాష్ట్రానికి మళ్ళీ అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ దేశంతో మైత్రిని పెంచాలని తెలిపారు.

అంతేకాక, తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయమూర్తి నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణపై చర్చించి, ఇకపై కఠినంగా వ్యవహరించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఈనెల 26 నుంచి సీఎం చంద్రబాబు గారి సింగపూర్ పర్యటన

పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ

బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌తో పరిశ్రమలు తెచ్చేందుకు 6 రోజుల పర్యటన#Andhrapradesh#ChandrababuNaidupic.twitter.com/b7KwBIvtBx

— 𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀 (@Trends4TDP) July 24, 2025

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
అమరావతి
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved