- Home
- Sports
- Cricket
- Rishabh Pant: ఇంగ్లాండ్ టూర్‌లో భారత్‌కు బిగ్ షాక్.. సిరీస్ నుంచి రిషబ్ పంత్ అవుట్.. ఎందుకంటే?
Rishabh Pant: ఇంగ్లాండ్ టూర్‌లో భారత్‌కు బిగ్ షాక్.. సిరీస్ నుంచి రిషబ్ పంత్ అవుట్.. ఎందుకంటే?
Rishabh Pant: ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ నుంచి భారత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. ఇది భారత్ కు గట్టి ఎదురుబెబ్బ అని చెప్పవచ్చు.

టెస్టు సిరీస్‌కు దూరమైన రిషబ్ పంత్
భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. స్టార్ వికెట్‌కీపర్ బ్యాట్స్ మెన్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ నుండి పూర్తిగా తప్పుకున్నాడు. మాంచెస్టర్ టెస్ట్ తొలి రోజు క్రిస్ వోక్స్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో పంత్ కాలుకు బంతి తగిలి గాయం అయింది. గాయం తీవ్రంగా ఉండటంతో అతను వైద్యుల సూచనల మేరకు సిరీస్ నుంచి తప్పుకున్నారు.
రివర్స్ స్వీప్ ఆడే సమయంలో రిషబ్ పంత్ కు గాయం
భారత ఇన్నింగ్స్ 68వ ఓవర్లో, పంత్ 37 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న సమయంలో క్రిస్ వోక్స్ బౌలింగ్‌ను రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి నేరుగా ఆయన బూటుకు తాకి, పాదానికి బలంగా తగిలింది. వెంటనే రిషబ్ పంత్ నేలపై పడిపోయి తీవ్ర నొప్పితో బాధపడ్డారు. నడవలేని పరిస్థితిలో ఉండగా, చిన్న వాహనం లో గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆస్ప్రతికి తరలించి చికిత్స అందించారు.
రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ అప్‌డేట్
రిషబ్ పంత్‌ను వెంటనే ఫిజియో చికిత్సకు తీసుకెళ్లారు. బీసీసీఐ వర్గాల ప్రకారం టోకు ఫ్రాక్చర్ గా నిర్ధారణ అయింది. “పంత్ గాయానికి సంబంధించిన స్కాన్‌లో ఫ్రాక్చర్ గుర్తించారు. కనీసం ఆరు వారాలు విశ్రాంతి అవసరం. ఆయన తిరిగి బ్యాటింగ్ చేయగలరా అనే విషయంలో ఇంకా అనిశ్చితి ఉంది” అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తాజాగా పంత్ సిరీస్ మొత్తాని దూరం అవుతున్నారని రిపోర్టులు పేర్కొన్నాయి.
ఇషాన్ కిషన్ రీ ఎంట్రీ?
రిషబ్ పంత్ సిరీస్ మొత్తానికి దూరం కావడంతో అతని స్థానంలో మరో ప్లేయర్ ను తీసుకోవడం పై బీసీసీఐ దృష్టి పెట్టింది. పంత్ స్థానాన్ని భర్తీ చేయడానికి ఇషాన్ కిషన్ పేరు పరిశీలనలో ఉందని సమాచారం. అతను ఇటీవల నాటింగ్‌హాంశైర్ తరపున రెండు కౌంటీ మ్యాచ్‌లు ఆడాడు. అలాగే, భారత్-ఏ జట్టుతో కలిసి ఇంగ్లాండ్ లయన్స్‌తో సన్నాహక మ్యాచుల్లో కూడా ఉన్నాడు. అయితే, ఈ మ్యాచ్‌ల్లో ఆడలేదు.
ఇప్పటికే గాయాలతో భారత జట్టు బలహీనంగా మారింది
భారత జట్టు ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్ల గాయాల కారణంగా ఇబ్బందుల్లో ఉంది. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మోకాలి గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. పేసర్లు ఆకాష్ దీప్, అర్షదీప్ సింగ్ లు కూడా గాయాల కారణంగా నాల్గవ టెస్టులో ఆడటం లేదు.
సూపర్ ఫామ్ లో రిషబ్ పంత్
రిషబ్ పంత్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటివరకు నాలుగు టెస్టుల్లో 462 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 2022లో జరిగిన కారు యాక్సిడెంట్ తర్వాత 2024 ఐపీఎల్‌తో మళ్లీ క్రికెట్‌లోకి వచ్చిన పంత్... మళ్లీ గాయాలతో పోరాడాల్సి వస్తుండటం భారత్‌కు పెద్ద ఎదురు దెబ్బ.
పంత్ లేని పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ లేదా ధ్రువ్ జురేల్‌లలో ఒకరు వికెట్ కీపర్‌గా బాధ్యతలు తీసుకుంటారు. కేఎల్ రాహుల్ 2023-24 దక్షిణాఫ్రికా టూర్ తర్వాత వికెట్ కీపింగ్ చేయలేదు. ధ్రువ్ జురేల్ నాల్గవ టెస్టు ప్లేయింగ్ 11లో లేరు.
భారత జట్టు ఇప్పటికే సిరీస్‌లో 1–2తో వెనుకబడి ఉంది. మిగిలిన మ్యాచ్‌ల్లో పంత్ లేని లోటును ఎలా భర్తీ చేస్తుందన్నది అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.