మందు ఫుల్ బాటిల్ 750 మిల్లీ లీటర్లే ఎందుకుంటుంది? లీటర్ ఎందుకుండదు?
మందు ఫుల్ బాటిల్ అంటే 750 మిల్లీ లీటర్లే ఎందుకుంటుంది? ఎందుకీ పరిమాణం స్థిరంగా ఉంది? దీనికి సంబంధించిన ఫ్రెంచ్ వైన్ సంస్కృతి, అమెరికా గ్యాలన్ ప్రమాణాలు వంటి ఆసక్తికర కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకోండి.

మందు ఫుల్ బాటిల్ స్టోరీ
ఈరోజుల్లో మద్యం మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ప్రజల ఆరోగ్యానికి హానికరం అయినా ప్రభుత్వాలు ఆదాయంకోసం మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో కాలేజీ పిల్లల నుండి పండుముసలివారి వరకు మద్యం సేవిస్తున్నారు.
డబ్బులున్నోళ్లు ఫారెన్ బ్రాండ్స్, మద్యతరగతివారు దేశీయ బ్రాండ్స్, పేదవారు చీఫ్ లిక్కర్ తాగుతుంటారు... ఇక మహిళలు వైన్, వోడ్కా, బీర్లు వంటివి తాగుతారు. మందుకు స్టేటస్, జెండర్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ఈ కాలంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు విందుతో పాటు మందుకూడా తప్పనిసరి అయిపోయింది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ముక్క, చుక్క లేనిదే శుభకార్యమే కాదు అశుభకార్యం కూడా ఉండదు.
అయితే మద్యం సేవించినవారిని ఎప్పుడైనా ఎంత తాగావని అడిగితే క్వార్టర్ లేదా హాఫ్ కొట్టానని చెబుతారు. ఇద్దరుముగ్గురి గ్యాంగ్ ఉంటే ఫుల్ బాటిల్ లేపేసామని చెబుతారు. మరి ఈ ఫుల్ బాటిల్ అంటే ఎంత? అని అడిగితే చాలామందికి తెలియదు. ఓ ఫుల్ బాటిల్ అంటే 750 మిల్లీ లీటర్లు... హాఫ్ అంటే 375 మి.లీ.. క్వార్టర్ అంటే 180 మి.లీ.
ఫుల్ బాటిల్ 750 మిల్లి లీటర్లే ఎందుకు?
ఇక్కడ మీకో డౌట్ రావచ్చు... వాటర్ లేదంటే మరే లిక్విడ్స్ అయినా లీటర్లలో చెబుతాయి. చిన్న వాటర్ బాటిల్ 2 లీటర్లు, ఆయిల్ ప్యాకెట్స్ 1లీ ప్యాకెట్స్, 5 లీటర్ బాటిల్స్ లో ఉంటాయి. మరి మద్యం ఎందుకిలా 750, 375, 180 మి.లీ బాటిల్స్ లో ఉంటుంది? ఇందుకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రెంచ్ సాంప్రదాయం
ఫ్రాన్స్ లో వైన్ సాంప్రదాయ పానియం. ఈ దేశంలో పురాతన కాలంనుండి వైన్ తయారుచేస్తారు, తాగుతారు. అయితే వీళ్లు ఫుడ్ ను వైన్ తో పాటు తీసుకుంటారు. సాధారణంగా ఓ వ్యక్తి ఒకపూటలో ఆరు పెగ్ ల వరకు తాగుతుంటారు. ఇలా ఇద్దరు వ్యక్తులకు ఒకపూట సరిపడా అంటే 12 పెగ్గుల మద్యాన్ని కలిపితే దాదాపు 750 మి.లీ అవుతుంది... కాబట్టి ఒకసారికి సరిపోయేలా 750 మి.లీ బాటిల్ లో పోసేవారు. ఇదే కంటిన్యూ అవుతూ వస్తోంది.
ప్రెంచ్ బ్యారల్ రీజన్
గతంలో వైన్ ను తయారుచేసి ప్రెంచ్ బ్యారల్స్ నిల్వ ఉంచేవారు... రవాణా కూడా ఇందులోనే చేసేవారు. అయితే ఓ ప్రెంచ్ బ్యారల్ లో 225 లీటర్ల మద్యం పట్టేది. దీన్ని లీటర్ బాటిల్స్ లోకి పోస్తే 225 వచ్చేవి... కానీ ఇది ఎందుకో ఫ్రెంచ్ ప్రజలకు నచ్చలేదట.
అయితే 175 మి.లీ బాటిల్స్ లో ఓ బ్యారల్ వైన్ పోస్తే సరిగ్గా 300 బాటిల్స్ నిండేవి… ఇది బాగుండటంతో దీన్నే కంటిన్యూ చేశారు. తర్వాత ఈ బ్యారల్ మారినా బాటిల్స్ మాత్రం 750 మి.లీ ఫిక్స్ అయిపోయాయి.
అమెరికా గ్యాలన్స్ రీజన్
అమెరికాలో ద్రవ పదార్థాలను లీటర్లలో కాకుండా గ్యాలన్స్ లో కొలుస్తారు. 1 గ్యాలన్ అంటే 3.785 లీటర్లు. ఇలా ఒక గ్యాలన్ ను పర్ఫెక్ట్ గా పంచాలంటే 750 ఎంఎల్ అయితే అయిదు బాగాలు అవుతుంది. అందుకే మద్యం బాటిల్స్ ను 750 మి.లీ గా నిర్దారించారు. అమెరికాలో ఫుల్ బాటిల్ ను ఫీప్త్ అంటారు.. అంటే గ్యాలన్ లో ఐదో వంతు అని అర్ధం.