నేడు భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. ఉదయం 10. 30 గంటలకి కన్నుల పండువగా కార్యక్రమం నిర్వహించనున్నారు. హాజరై పట్టువస్త్రాలు సమర్పించనున్న గవర్నర్ దంపతులు. ఇక ట్రంప్ పాలన తీరుకు నిరసనగా అమెరికన్లు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదానికి సంబంధించిన అప్డేట్స్, వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించిన అంశాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలో 4 రోజుల పాటు తేలికపాటి వర్షాలు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటితో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం..

11:50 PM (IST) Apr 07
ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడేలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ జట్టు భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చివరికి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు ఆర్సీబీ విజయం సాధించింది.
11:34 PM (IST) Apr 07
సౌదీ అరేబియా హజ్ యాత్ర దగ్గరపడుతుండటంతో 14 దేశాలకు వీసాలు ఇవ్వడం తాత్కాలికంగా ఆపేసింది. ఉమ్రా, వ్యాపారం, కుటుంబ సందర్శన వీసాలకు జూన్ మధ్య వరకు బ్రేక్ వేశారు. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ చేయడం ఆపడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
పూర్తి కథనం చదవండి11:07 PM (IST) Apr 07
artificial intelligence: అనుకోని సంఘటనల్లో పేగుబంధం పంచిన మన అమ్మానాన్నలు చనిపోవడం, ప్రమాదవశాత్తు రక్తం పంచుకుని పుట్టిన అన్నయ్యా, తమ్ముడు, అక్క, చెల్లి దూరం అవడం. మమకారం, ఆప్యాయతలు పంచిన అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు లేకపోవడం ఎంతో బాధాకరం కదా.. అయితే వీరందరూ తిరిగి ప్రత్యక్షం అయితే.. మనం తట్టుకోగలమా..? అలాంటిది శుభకార్యం వేళ మన నుంచి దూరం అయిన వారు వచ్చి ఆశీర్వదిస్తే.. ఆ క్షణం ఎవరికైనా మాటలు వస్తాయా... కంట్లో నుంచి నీరు తప్పా.. ఇలాంటి దృశ్యాలను ఏఐతో సాధ్యం చేస్తున్నారు నేటి ఫొటో గ్రాఫర్లు. ఏఐ వినియోగించి చనిపోయిన వారందరినీ వీడియో రూపంలో తీసుకొచ్చేస్తున్నారు. అసలు దీనికి ఖర్చు ఎంతవుతుందో తెలుసుకుందామా మరి?
పూర్తి కథనం చదవండి11:03 PM (IST) Apr 07
ఐపీఎల్ అంటేనే ఎప్పుడు, ఏం జరుగుతుందో, ఎవరూ ఊహించలేరు. అద్భుతమైన బ్యాటింగ్, బుల్లెట్లా దూసుకొచ్చిన బంతులతో పాటు అదిరిపోయే క్యాచ్‌లు ప్రేక్షకులను ఎగ్జైట్‌మెంట్‌కు గురి చేస్తాయి. మ్యాచ్‌లో జరిగే ఇలాంటి సంఘటనల కోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. తాజాగా సోమవారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలాంటి ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది..
10:38 PM (IST) Apr 07
rains: రాబోయే రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పూర్తి కథనం చదవండి
10:12 PM (IST) Apr 07
పాకిస్తాన్ యుద్ధనౌక పంపుతానని బంగ్లాదేశ్ కు ఇచ్చినమాట తప్పింది. ఇది స్నేహంలో మోసమా? ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకొండి.
పూర్తి కథనం చదవండి09:56 PM (IST) Apr 07
ap dsc notificatio:ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లోనే నోటిఫికేషన్ వస్తుందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఎట్టకేలకు నోటిఫికేషన్ ఇచ్చి తీరాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ రావాల్సి ఉండగా.. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ వల్ల కాస్త ఆలస్యం అయ్యింది. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకోగా.. నోటిఫికేషన్ విడుదల తేదీని సూచనప్రాయంగా తెలిపారు.
పూర్తి కథనం చదవండి09:53 PM (IST) Apr 07
కారు కొనాలి అనుకుంటే ఇండియాలో ఎవరికైనా ముందు గుర్తొచ్చే పేరు మారుతీ సుజుకీ. నమ్మకమైన బ్రాండ్, తక్కువ ధర కారణంగా ఈ బ్రాండ్ టాప్ సెల్లర్ గా నిలుస్తోంది. కాంపాక్ట్ క్రాసోవర్ విభాగంలో ఈ కంపెనీ మోడల్ ఫ్రాంక్స్ అత్యధికంగా అమ్ముడవుతోంది. దాంతో వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు ఈ మోడళ్లో హైబ్రిడ్ టెక్నాలజీ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది మారుతి సుజుకి.
పూర్తి కథనం చదవండి09:33 PM (IST) Apr 07
ఐపీఎల్ 2025లో వాంఖడే స్టేడియంలో జరుగుతోన్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బ్యాటర్లు చెలరేగారు. విరాట్ కోహ్లీ, పాటిదార్ అద్భుత బ్యాటింగ్‌తో ముంబై ముందు భారీ టార్గెట్‌ను ఉంచారు. మరి ముంబై ఈ టార్గెట్‌ను అధిగమిస్తుందా, ఇంతకీ ముంబై విజయానికి ఎన్ని పరుగులు చేయాల్సి ఉంది. ఇప్పుడు తెలుసుకుందాం..
09:31 PM (IST) Apr 07
ఇండియన్ ఐడల్ 15 విజేత: ఇండియాలో ఇండియన్ ఐడల్ రియాలిటీ షోకు ఉన్న క్రేజే వేరు. పాడటం అంటే ఇష్టపడే గాయకులు జీవితంలో ఒక్కసారైనా ఈ షోలో పాల్గొనాలనుకుంటారు. అంతటి పాపులారిటీ ఉన్న ఈ సింగింగ్ కాంపిటీషన్ 'ఇండియన్ ఐడల్ 15'లో కోల్‌కతాకు చెందిన మానసి ఘోష్ ఈసారి విజేతగా నిలిచింది. విజేతగా నిలిచినందుకు మానసికి ఏమేం దక్కాయంటే..
పూర్తి కథనం చదవండి09:11 PM (IST) Apr 07
మహారాష్ట్రలోని కరువు పీడిత ధారాశివ్ జిల్లాలో 734 గ్రామాల మధ్య నీటి యాజమాన్య పోటీ మొదలైంది ఉత్తమ నమూనాకు జాతీయ స్థాయిలో ప్రచారం లభిస్తుంది. ఈ గ్రామాల జల పునరుజ్జీవన ఉద్యమం ఎలా ఉంటుందో తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి08:50 PM (IST) Apr 07
అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండి08:42 PM (IST) Apr 07
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరుదైన ఘనతను సాధించాడు. టీ20లో అరుదైన ఘనత సాధించిన తొలి భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు కోహ్లి. తాజాగా సోమవారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఈ ఘనతను సాధించాడు. ఇంతకీ కోహ్లీ సాధించిన ఆ ఘనత ఏంటి.? ఈ జాబితాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
08:16 PM (IST) Apr 07
ప్రస్తుతం ఇంటర్నెట్ ఎంతలా విస్తరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 5జీ వరకు మన ఇంటర్నెట్ ప్రయాణం చేరుకుంది. ఇప్పటికే 6జీకి సంబంధించిన పనులు కూడా మొదలవుతున్నాయి. ఒకప్పుడు నెమ్మదిగా ఉన్న ఇంటర్నెట్ వేగం ఇప్పుడు జెట్ వేగంతో పెరిగింది. బఫరింగ్ లేకుండా వీడియోలను వీక్షిస్తున్నాం. అయితే ఇంటర్నెట్ విప్లవానికి ప్రధాన కారణమైన ఆప్టికల్ కేబుల్స్‌ను కనిపెట్టిన వ్యక్తి మన భారతీయుడే అని మీలో ఎంత మందికి తెలుసు.? ఇంతకీ ఎవరా వ్యక్తి ఆయన బ్యాగ్రౌండ్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
08:05 PM (IST) Apr 07
Telangana and Andhra Pradesh Holidays : తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులే కాదు ఉద్యోగులకు కూడా ఈవారం వరుస సెలవులు వస్తున్నాయి. ఇంకో రెండ్రోజులు మాత్రమే వర్కింగ్ డేస్... మిగతా ఐద్రోజుల్లో ఒక్కరోజు మినహా మిగతావన్నీ సెలవులే. ఈ ఒక్కరోజు లీవ్ తీసుకుంటే వరుసగా ఐదురోజుల సెలవులను ఎంజాయ్ చేయవచ్చు. ఏఏ రోజు సెలవు ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి07:44 PM (IST) Apr 07
PAN with Aadhaar: పాన్ కార్డు ఉన్న వాళ్లు అందరూ ఈ సమాచారం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే మీ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) మరికొంత కాలం గడువు ప్రకటించింది. అయితే ఆ తేదీలోపు పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయించకపోతే పాన్ కార్డు రద్దు అవుతుంది. ఈ విషయం గురించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి07:35 PM (IST) Apr 07
ఐపీఎల్ 2025లో భాగంగా మరికాసేపట్లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ముంబైని ఓడించి వాంఖడే స్టేడియంలో జెండా పాతాలని ఆర్సీబీ భావిస్తోంది. అయితే బెంగళూరుకు విజయం అంత ఈజీ కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ ముగ్గురు బౌలర్స్‌తో ఆర్సీబీ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఎవరా ముగ్గురు.? వారితో పొంచి ఉన్న ప్రమాదం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
06:30 PM (IST) Apr 07
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇచ్చింది. గ్యాస్ సిలిండర్ ధరను మరింత పెరిగింది. ప్రస్తుత పరిస్ధితుల్లో ధరల పెంపు తప్పలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఇంతకూ ఒక్కో సిలిండర్ ధర ఎంత పెరిగిందో తెలుసా?
పూర్తి కథనం చదవండి06:25 PM (IST) Apr 07
మార్కెట్లో రోజుకో కొత్త ఫోన్ సందడి చేస్తోంది. మారిన టెక్నాలజీకి అనుగుణంగా కొంగొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ బడ్జెట్ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. పోకో సీ71 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
06:20 PM (IST) Apr 07
06:00 PM (IST) Apr 07
Discount on Train Tickets: ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్స్ బుక్ చేసుకొనే వారు ఇప్పుడు టికెట్ ధరలో 50 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఐఆర్‌సీటీసీ తన కస్టమర్ల కోసం ఎన్నో రాయితీలు ప్రకటిస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రత్యేకమైన ఆఫర్ ఎవరికి వర్తిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
05:56 PM (IST) Apr 07
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అమెరికా ఇంటర్నెట్ లో పెద్ద దుమారంగా మారారు. 50 ఏళ్ళ వయసులో హృతిక్ రోషన్ యంగ్ లుక్ కి అమెరికా జనాలు ఫిదా అవుతున్నారు. దీంతో అమెరికా ఇంటర్నెట్, గూగుల్ లో హృతిక్ ట్రెండింగ్ లో టాప్ పొజిషన్ లో ఉన్నారు. అసలు అమెరికాలో హృతిక్ గురించి చర్చ ఎందుకు మొదలైందో ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండి
05:39 PM (IST) Apr 07
జంటలు ప్రైవసీ కోరుకుంటే సినిమాకు వెళ్తారు లేదా హోటల్స్ లో రూమ్స్ తీసుకుంటారు. కానీ కారులో ప్రయాణించే సమయంలో ప్రైవసీ లబించాలంటే అది అంత సులభమైన విషయం కాదు. కానీ బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ కపుల్స్ కోసం ప్రత్యేక క్యాబ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్మూచ్ క్యాబ్స్ పేరుతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ క్యాబ్స్ నిజంగానే అందుబాటులోకి వచ్చాయా.? ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
05:12 PM (IST) Apr 07
Medicines Tips: సాధారణంగా చాలా మంది మెడిసన్ వేసుకోవడంలో చాలా తప్పులు చేస్తుంటారు. అందువల్లనే రోగాలు తర్వగా తగ్గవు. టాబ్లెట్స్ వేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అలా కాకుండా ఇష్టానుసారం వేసుకుంటే ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గకపోగా, ఇతర ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. మెడిసన్ కరెక్ట్ గా ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
05:07 PM (IST) Apr 07
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోతున్నా భారతదేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ.2 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మాంద్యం భయాలు, ట్రంప్ యొక్క టారిఫ్ యుద్ధం దీనికి కారణం. ఇది ఆర్థిక మార్కెట్లలో, చమురు ఆధారిత రంగాలలో ఆందోళనలను పెంచుతోంది.
పూర్తి కథనం చదవండి04:46 PM (IST) Apr 07
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో మరో ఆసక్తికర పోరుకు వాంఖడే స్టేడియం వేదిక కాబోతోంది. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఎన్నిసార్లు తలపడ్డాయి.? వీరిలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
04:25 PM (IST) Apr 07
Siri Hanumanth: బెట్టింగ్స్ యాప్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా యాప్స్ ప్రమోట్ చేస్తున్న అనేక మంది తెలుగు సెలబ్రిటీలు, బుల్లితెర నటులు, యూట్యూబర్స్, ఇన్‌ఫ్ల్యూయన్సర్లపై పోలీసులు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న వారిలో అబ్బాయిలతోపాటు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇక వైజాగ్‌కి చెందిన మన తెలుగమ్యాయి బిగ్‌బాస్ ఫేమ్ సిరి హనుమంతు బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసి ఎంత సంపాదించిందో తెలిస్తే మీరూ షాక్ అవుతారు.
పూర్తి కథనం చదవండి04:06 PM (IST) Apr 07
జూనియర్ ఎన్టీఆర్ గురించి స్టార్ డైరెక్టర్ సుకుమార్ తబిత భార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కి ఎన్టీఆర్ రిప్లై ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. నాన్నకు ప్రేమతో చిత్రంలో తారక్.. సుకుమార్ దర్శకత్వంలో నటించిన సంగతి తెలిసిందే. తబిత చేసిన పోస్ట్ తో సుక్కు, ఎన్టీఆర్ కాంబినేషన్ పై ఊహాగానాలు మొదలయ్యాయి.
03:55 PM (IST) Apr 07
వస్తువులను ఎక్కువగా లారీలు, ట్రక్కుల్లో రవాణా చేయడం చూస్తుంటాం... అంతర్జాతీయ స్థాయిలో అయితే షిప్పుల్లో రవాణా చేస్తాం. ఈ రోడ్డు, జల రవాణా వల్ల ఖర్చులు తగ్గి తక్కువ ధరకే ఆ వస్తువులు మార్కెట్లో లభిస్తాయి. కానీ ప్రస్తుతం యాపిల్ ఐపోన్స్ ను విమానాల్లో రవాణా చేస్తున్నారు. యాపిల్ వస్తువుల ధరలు పెరగకుండా ఉండేందుకే ఇలా ఆకాశంలో రవాణా చేస్తున్నారు. విమానాల్లో యాపిల్ వస్తువుల రవాణాకు కారణమేంటో తెలుసా?
పూర్తి కథనం చదవండి03:23 PM (IST) Apr 07
డిజే టిల్లు ఫాదర్ క్యారెక్టర్ చేసిన నటుడు మురళీధర్ గౌడ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణకు చెందిన ఆయన ఆ స్లాంగ్‌లో డైలాగులు చెబుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా హీరో, హీరోయిన్లకు తండ్రి పాత్రల్లో ఎక్కువగా నటిస్తున్నారు. ఇక డీజీ టిల్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీధర్ గౌడ్ ఫ్లాష్ బ్యాక్ తెలిస్తే నిజంగా ఎవరైనా కంటతడి పెట్టేస్తారు. ఆయన అనుభవాలు తెలుసుకుంటే మీ కష్టాలను కూడా మరిచిపోతారు.
03:12 PM (IST) Apr 07
Update KYC: బ్యాంకు ఖాతాదారులకు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఈ ఆదేశాలను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. విషయం ఏంటంటే.. మీరు గాని మీ బ్యాంకు అకౌంట్ ను ఇప్పటి వరకు కేవైసీ అప్ డేట్ చేయించుకోకపోతే వెంటనే చేయించుకోండి. ఏప్రిల్ 10 వరకే గడువు ఉంది. ఈ తేదీ దాటిన తర్వాత మీ బ్యాంకు అకౌంట్ తాత్కాలికంగా స్తంభించిపోతుంది. ఏ బ్యాంకు అకౌంట్ హోల్డర్లు కేవైసీ అప్ డేట్ చేయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి02:47 PM (IST) Apr 07
సూపర్ స్టార్ రజినీతో నటించే ఛాన్స్ కోసం హీరోయిన్లు ఎదురు చూస్తుంటే, రజినీనే ఫోన్ చేసి పిలిచినా వద్దన్నారు పెప్సీ ఉమా.
పూర్తి కథనం చదవండి01:15 PM (IST) Apr 07
వారెస్ బఫెట్...అనుభవం ముందు ఏదీ పనికిరాదని నిరూపిస్తున్నాడు. ట్రంప్ దెబ్బకు యావత్ ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతుంటే బఫెట్ మాత్రం నిశ్చింతంగా ఉన్నారు. ఇంకా ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే అతడి సంపద చాలా పెరిగింది. ట్రంప్ కు అత్యంత సన్నిహితుడు, ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ కు సాధ్యం కానిది బఫెట్ కు ఎలా సాధ్యమయ్యింది? అతడి సక్సెస్ సీక్రెట్ ఏమిటి?
పూర్తి కథనం చదవండి11:45 AM (IST) Apr 07
ఇండియన్ ఐడిల్ -15వ టైటిల్‌ను కోల్‌కతాకు చెందిన అమ్మాయి దక్కించుకుంది. ఈ సింగింగ్ షోకు జడ్జిలుగా శ్రేయ ఘోషాల్, విశాల్ దద్లాని, బాద్‌షా వ్యవహరించారు. ఈ 15వ సీజన్‌ను ఆదిత్య నారాయణ్ హోస్ట్ చేశారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌కు శిల్పాశెట్టి, రవీనా టాండన్, మికా సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫైనల్స్‌లో మొత్తం ముగ్గురు ఎంపిక కాగా.. అందులో ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఎంపికైంది. చివరికి ఆ ఇద్దరినీ వెనక్కినెట్టిన కోల్‌కతా అమ్మాయి కప్పు కొట్టేసింది. ఆమె ఎవరో తెలుసుకుందామా...
పూర్తి కథనం చదవండి11:14 AM (IST) Apr 07
ప్రముఖ స్టీల్ తయారీ సంస్థ ఎంఎస్ ఫౌండ్రీస్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ వ్యాపార విస్తరణలో భాగంగా మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా ఏకంగా రూ. 1200 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది.
10:43 AM (IST) Apr 07
కథలు మన ఆలోచన విధానాన్ని మారుస్తాయి. మనలో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపుతాయి. అలాంటి ఎన్నో కథలు చిన్న నాటి నుంచి చదువుతూనే ఉంటున్నాం. అలాంటి ఒక స్ఫూర్తివంతమైన కథ గురించి ఈరోజు తెలుసుకుందాం..
09:55 AM (IST) Apr 07
ఏమంటూ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవి స్వీకరించారో ఆ రోజు నుంచి ఏదో ఒక అలజడి రేగుతూనే ఉంది. ఒక్క అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచమంతా ట్రంప్ ప్రభావం పడుతోంది. తాజాగా ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం యావత్ ప్రపంచంపై పడింది. స్టాక్ మార్కెట్లపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది..
08:55 AM (IST) Apr 07
చైనా, ఇతర దేశాలతో వాణిజ్య లోటును వెంటనే సరిచేస్తానని ట్రంప్ అన్నారు. సుంకాల వల్ల అమెరికాకు లాభం ఉంటుందని చెప్పారు. ప్రతీకార సుంకాలపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నా, సొంత దేశానికి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా ట్రంప్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు..
పూర్తి కథనం చదవండి08:36 AM (IST) Apr 07
తమిళనాడుకు కేంద్రం నిధులపై ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. నిధులు పెంచినా కొందరు ఫిర్యాదు చేస్తున్నారని మోదీ విమర్శించగా, నియోజకవర్గాల పునర్విభజనతో తమిళనాడుకు అన్యాయం జరగకుండా చూడాలని స్టాలిన్ కోరారు.
పూర్తి కథనం చదవండి