- Home
- Business
- PAN with Aadhaar: ఆ తేదీ లోపు మీ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదు
PAN with Aadhaar: ఆ తేదీ లోపు మీ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదు
PAN with Aadhaar: పాన్ కార్డు ఉన్న వాళ్లు అందరూ ఈ సమాచారం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే మీ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) మరికొంత కాలం గడువు ప్రకటించింది. అయితే ఆ తేదీలోపు పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయించకపోతే పాన్ కార్డు రద్దు అవుతుంది. ఈ విషయం గురించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కాలంలో పాన్ కార్డు లేకుండా ఎక్కువ మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్స్ చేయలేం. బ్యాంక్ పనుల నుంచి ఆఫీస్ పనుల వరకు పాన్ కార్డు అవసరం. ఇప్పుడు పాన్ కార్డు గురించి కొత్త సమాచారం వచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ప్రకటించిన వివరాల ప్రకారం పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయని వాళ్లు డిసెంబర్ 31, 2025 లోపు లింక్ చేయించుకోవాలి. లేదంటే వాళ్ల పాన్ కార్డు పనిచేయదు.
ముఖ్యంగా ఆధార్ నంబర్ బదులు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ కార్డు పొందిన వాళ్లు ఈ రూల్ పాటించాలి. డిసెంబర్ 31, 2025 లోపు లింక్ చేయకపోతే ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా పాన్ వాడలేరు. దీని వల్ల ఎక్కువ అమౌంట్ పంపాలనుకున్న వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఇది కూడా చదవండి అంబానీ అంత నష్టాల్లో ఉన్నారా? ఫోర్బ్స్ టాప్ 10 బిలియనీర్ల లిస్టు నుంచి అంబానీ అవుట్
ఒకవేళ మీరు పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయించకపోతే గడువు పూర్తయిన తర్వాత లింక్ చేయించడానికి 1,000 రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అందువల్ల జరిమానా పడకుండా ఉండాలంటే డిసెంబర్ 31, 2025 లోపు లింక్ చేయించుకోండి. ముఖ్యంగా ఆధార్ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ కార్డు పొందిన వాళ్లు ఈ లింకేజ్ తప్పుకుండా చేయించాలి.
మీరు ఆన్‌లైన్‌లో లింక్ చేయించాలనుకుంటే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌కి వెళ్లి ఫామ్ నింపండి. లేదా మీ దగ్గరలోని ఆన్ లైన్ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి లింక్- I ఫామ్ నింపాలి. మీ ఆధార్, పాన్ తో లింక్ అయితే వెంటనే మీకు మెసేజ్ వస్తుంది.
ఇది కూడా చదవండి ఏంటీ.. రూ.24.8 లక్షల కోట్ల లావాదేవీలా? అది కూడా ఒక్క నెలలో.. యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో కొత్త రికార్డ్