MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Technology
  • Tech News
  • Internet: ఈ రోజు మనం ఇంటర్నెట్ వాడుతున్నామంటే దానికి ఈ వ్యక్తే కారణం.. ఇంతకీయన ఎవరంటే

Internet: ఈ రోజు మనం ఇంటర్నెట్ వాడుతున్నామంటే దానికి ఈ వ్యక్తే కారణం.. ఇంతకీయన ఎవరంటే

ప్రస్తుతం ఇంటర్నెట్‌ ఎంతలా విస్తరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 5జీ వరకు మన ఇంటర్నెట్‌ ప్రయాణం చేరుకుంది. ఇప్పటికే 6జీకి సంబంధించిన పనులు కూడా మొదలవుతున్నాయి. ఒకప్పుడు నెమ్మదిగా ఉన్న ఇంటర్నెట్‌ వేగం ఇప్పుడు జెట్‌ వేగంతో పెరిగింది. బఫరింగ్ లేకుండా వీడియోలను వీక్షిస్తున్నాం. అయితే ఇంటర్నెట్‌ విప్లవానికి ప్రధాన కారణమైన ఆప్టికల్ కేబుల్స్‌ను కనిపెట్టిన వ్యక్తి మన భారతీయుడే అని మీలో ఎంత మందికి తెలుసు.? ఇంతకీ ఎవరా వ్యక్తి ఆయన బ్యాగ్రౌండ్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..  

1 Min read
Author : Narender Vaitla
| Updated : Apr 07 2025, 08:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Dr Narinder Singh Kapany

Dr Narinder Singh Kapany

ఇప్పుడు మనం ఇంత హై స్పీడ్ ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నామంటే దానికి కారణం ఫైబర్ ఆప్టిక్స్. అయితే ఇలాంటి అద్భుత ఆవిష్కరణకు కారణమైన వ్యక్తి ఎవరో తెలుసా.? ఆ గొప్ప సైంటిస్ట్ పేరు డాక్టర్ నరేందర్‌ సింగ్ కపానీ. నరేందర్‌ ఇండియాలోని పంజాబ్‌లో పుట్టారు. విద్యాభ్యాసం ముగిసిన తర్వాత పై చదువుల నిమిత్తం ఆయన అమెరికా వెళ్లారు. అనంతరం పెద్ద భౌతిక శాస్త్రవేత్తగా పేరు సంపాదించుకున్నారు. నరేందర్‌ దాదాపు యాభై ఏళ్ళ క్రితమే ఫైబర్ ఆప్టిక్స్‌ను కనిపెట్టారు. ఇది ఈ రోజుల్లో సమాచారం పంపే, తీసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేసింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Reliance Optical Fiber

Reliance Optical Fiber

డాక్టర్ నరీందర్ సింగ్ 94 ఏళ్ళ వయసులో 2020 డిసెంబర్ 4న చనిపోయారు. 2021లో ఆయనకు మరణానంతరం ఇండియాలో రెండో అతిపెద్ద పౌర పురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించింది భారత ప్రభుత్వం. నరేందర్‌ సింగ్ కపానీని 1999లో ఫార్చ్యూన్ మ్యాగజైన్ నోబెల్ బహుమతికి అర్హత కలిగిన ఆవిష్కరణ చేసిన 20వ శతాబ్దపు ఏడుగురు వ్యక్తుల్లో ఒకరిగా గౌరవించింది. 1940ల చివర్లో కపానీ పాత సైన్స్‌కు సవాల్ విసిరారు. కాంతి సూటిగా మాత్రమే ఎందుకు వెళ్తుందన్న విషయాన్ని ఆయన ప్రశ్నించారు. 

33

1953లో ఆయన ఫైబర్ ఆప్టిక్స్ కనిపెట్టారు. మనిషి వెంట్రుకల కంటే కొంచెం లావుగా ఉండే ఫైబర్ ద్వారా మంచి క్వాలిటీ ఉన్న ఫోటోలు పంపించారు. ఇది ఒక పెద్ద మార్పు. ఆయన తన ఆవిష్కరణతో ప్రపంచానికి కొత్త దారిని చూపించారు. కపానీ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది జీవితాలపై చెరగని ముద్ర వేశారు. కపానీ 1927లో పంజాబ్‌లోని మోగాలో ఒక సిక్కు కుటుంబంలో జన్మించారు.

ఆయన చిన్నతనమంతా పంజాబ్‌లో గడిచింది. డెహ్రాడూన్‌లో చదువుకున్నారు. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి వెళ్లే ముందు ఆగ్రా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1953లో కపానీ, హెరాల్డ్ హాప్‌కిన్స్‌తో కలిసి ఆప్టికల్ ఫైబర్ ద్వారా మంచి ఫోటోలు పంపే విధానాన్ని కనుగొన్నారు. దాంతో ‘ఫైబర్ ఆప్టిక్స్’ అనే పదాన్ని సృష్టించారు. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ప్రపంచం
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Reels: రీల్స్ తెగ చూస్తుంటారా.? మీ జేబుకు చిల్లు ప‌డుతున్న‌ట్లే, ఎలాగంటే
Recommended image2
iQOO Neo 11 Ultra: 9100mAh బ్యాటరీ, 2K డిస్‌ప్లేతో ఐక్యూ కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే
Recommended image3
Planetary Parade: నక్షత్రాల వర్షం.. ఆకాశంలో అరుదైన అద్భుతం.. ఒకే రోజు 4 ఖగోళ వింతలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved