సారాంశం

ప్రముఖ స్టీల్‌ తయారీ సంస్థ ఎంఎస్‌ ఫౌండ్రీస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ వ్యాపార విస్తరణలో భాగంగా మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా ఏకంగా రూ. 1200 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. 
 

ఎంస్‌ఎస్‌ అగర్వాల్‌ ఫౌండ్రీస్‌ దేశవ్యాప్తంగా 1000కి పైగా డీలర్లతో తమ వ్యాపార పరిధిని విస్తరించేలా ప్రణాళికలు రూపొందించింది. రూ. 1200 కోట్లకుపైగా పెట్టుబడులతో 1.2 మిలియన్‌ టీపీఎ ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. తుప్పును తట్టుకునే విధంగా స్టీల్‌ తయారీ కోసం అధునాతన టెక్నాలజీని ఉపయోగించనుంది. రానున్న 18 నుంచి 20 నెలల్లో దేశవ్యాప్తంగా 1000కిపైగా యాక్టివ్‌ డీలర్లకు విస్తరించనున్నారు. విస్తరణ ద్వారా 5000కిపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 2024లో ఎంఎస్‌ సంస్థ 25,000 ఇళ్ల నిర్మాణంలో భాగం కాగా, 2025-26 నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేసే దిశగా అడుగులు వేస్తోంది. 

శుక్రవారం సికింద్రాబాద్‌లోని టీ19 టవర్స్‌లో జరిగిన ప్రత్యేక లాంచ్ ఈవెంట్‌లో ఎమ్‌ఎస్‌ అగర్వాల్‌ ఫౌండ్రీస్‌ నూతన ఉత్పత్తి ఎమ్‌ లైఫ్‌ 600+ సీఆర్‌ఎస్‌ను ఆవిష్కరించింది. రానున్న 3 నుంచి 4 ఏళ్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని ఐదు రెట్లు పెంచడానికి రూ. 1200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతో ఉపాధి పెరడంతో పాటు రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడంలో తమ సంస్థ భాగస్వామ్యం కానుందని చెప్పుకొచ్చారు. 

ఈ కార్యక్రమంలో ఎస్‌ అగర్వాల్‌ ఫౌండ్రీస్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ ప్రమోద్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. అత్యాధునిక ఆర్‌ అండ్‌ డీ ద్వారా ఎస్‌ లైఫ్‌ 600+ సీఆర్‌ఎస్‌ టీఎమ్‌టీని రూపొందించామని తెలిపారు. ఇది ధృఢమైన నిర్మాణాలకు ఎంతో ఉపయోగపడుతుందని, ప్రపంచ స్థాయి ఉక్కుతో గృహ కొనుగోలుదారులను శక్తివంతం చేయడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. 

ఈ స్టీల్‌ ప్రత్యేకతలు ఇవే..

* అధిక లోడ్‌ సామర్థ్యం, ఉన్నతమైన తన్యత బలం.

* కటింగ్‌ వైఫల్యాలను నివారించడానికి అధిక పొడువు, ఏకరీతి దిగుబడి.

* అధునాతన తప్పు నిరోధకత కలిగిన మన్నికైన ఉక్కుతో నిర్మాణ జీవన కాలం పెరుగుతుంది. 

* అసాధరణమైన వెల్డబిలీటీ, అగ్ని నిరోధక, భద్రత మన్నికను నిర్ధారిస్తుంది.  మరిన్ని వివరాలకు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.