MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Medicines Tips: మెడిసన్ వేసుకొనేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి

Medicines Tips: మెడిసన్ వేసుకొనేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి

Medicines Tips: సాధారణంగా చాలా మంది మెడిసన్ వేసుకోవడంలో చాలా తప్పులు చేస్తుంటారు. అందువల్లనే రోగాలు తర్వగా తగ్గవు. టాబ్లెట్స్ వేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అలా కాకుండా ఇష్టానుసారం వేసుకుంటే ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గకపోగా, ఇతర ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. మెడిసన్ కరెక్ట్ గా ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 07 2025, 05:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ తో డాక్టర్ దగ్గరకు వెళ్తే ప్రిస్క్రిప్షన్ రాస్తారు. ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలో అందులో వివరిస్తారు. మందులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వేసుకోమంటారు. కొందరు ఏదైనా తిన్న తర్వాత మందులు వేసుకోమంటారు. అయితే చాలా మంది ఇక్కడే తప్పులు చేస్తుంటారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం చేసిన తర్వాత మందులు వేసుకోమని డాక్టర్లు సూచిస్తే.. చాలా మంది భోజనం తిన్న వెంటనే, కాస్త కూడా గ్యాప్ లేకుండా టాబ్లెట్స్ వేసేసుకుంటారు. ఇది చాలా తప్పు అని డాక్టర్లు చెబుతున్నారు. తిన్న తర్వాత అంటే భోజనం చేసిన కనీసం 15 నుంచి 20 నిమిషాల తర్వాత మందులు వేసుకోవాలని చెబుతున్నారు. 
 

35

ఆహారం తిన్న వెంటనే టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయని చెబుతున్నారు. తిన్న ఆహారమే అరకుండా వెంటనే టాబ్లెట్ వేసుకోవడం వల్ల అందులో ఉండే మెడిసన్ శరీరంలో సమస్య ఉన్న చోటకు సరిగా చేరుకోదని చెబుతున్నారు. దీని వల్ల సమస్య తగ్గకపోగా, ఇన్ డైజేషన్, ఎసిడిటీ లాంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
 

45

మరికొందరు  రెండు, మూడు మాత్రలను ఒకేసారి మింగేస్తుంటారు. ఇది అస్సలు మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఒకేసారి రెండు, మూడు రకాల మందులు వేసుకోవడం వల్ల అవి కడుపులో కెమికల్ రియాక్షన్ కి గురై సరిగ్గా పనిచేయవని అంటున్నారు. దీని వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గకపోగా పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ప్రతి టాబ్లెట్ కి కనీసం 10, 15 నిమిషాల గ్యాప్ అవసరమని చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి ఈ లక్షణాలు ఉంటే మీ శరీరంలో ఐరన్ తక్కువగా ఉందని అర్థం

55

కొందరు తలనొప్పి ఉందని, నీరసంగా ఉందని, కడుపుతో నొప్పిగా ఉందని డైరెక్ట్ గా మెడికల్ షాపుకు వెళ్లి టాబ్లెట్స్ తెచ్చేసుకుంటారు. అయితే దీర్ఘకాలంగా ఉండే ఇలాంటి ఆరోగ్య సమస్యలకు మెడికల్ షాపు వాళ్లు ఇచ్చే టాబ్లెట్స్ పనిచేయవని, డాక్టర్స్ చేసే పరీక్షల ద్వారా మాత్రమే కరెక్ట్ మెడిసన్ లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. దీర్ఘకాల సమస్యలు ఉన్న వారు డాక్టర్స్ సలహా లేకుండా ఎలాంటి మెడిసన్ వాడకూడదని హెచ్చరిస్తున్నారు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ఆరోగ్యం
జీవనశైలి
ఆహారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hanuman : హనుమంతుడి నుండి ఈ 5 పాఠాలు నేర్చుకుంటే.. మీ జీవితమే మారిపోతుంది
Recommended image2
Pressure Cooker: కుక్కర్ నుంచి వాటర్ లీక్ అవుతున్నాయా? ఇలా చేస్తే వాటర్ బయటకు రాదు
Recommended image3
Skin Allergies: గిల్టు నగలతో అలర్జీ వస్తుందా? ఈ టిప్ ట్రై చేేయండి..ఇంకెప్పుడూ ఆ సమస్యే ఉండదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved