MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • National
  • Smooch Car: ప్రేమికుల కోసం ప్రత్యేక క్యాబ్స్‌.. ప్రైవేసీకి 100 శాతం గ్యారెంటీ.

Smooch Car: ప్రేమికుల కోసం ప్రత్యేక క్యాబ్స్‌.. ప్రైవేసీకి 100 శాతం గ్యారెంటీ.

జంటలు ప్రైవసీ కోరుకుంటే సినిమాకు వెళ్తారు లేదా హోటల్స్ లో రూమ్స్ తీసుకుంటారు. కానీ కారులో ప్రయాణించే సమయంలో ప్రైవసీ లబించాలంటే అది అంత సులభమైన విషయం కాదు. కానీ బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ కపుల్స్ కోసం ప్రత్యేక క్యాబ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్మూచ్ క్యాబ్స్ పేరుతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ క్యాబ్స్ నిజంగానే అందుబాటులోకి వచ్చాయా.? ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 07 2025, 05:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎప్పుడు ఎలాంటి వార్త వైరల్‌ అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. అసలు ఆ వార్త నిజమో, కాదో కూడా తెలియని రోజులు వచ్చేశాయ్‌. నెట్టింట వైరల్‌ అయ్యే చాలా వరకు వార్తల్లో ఫేక్‌ న్యూస్‌ సర్క్యూలేట్‌ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ న్యూస్‌ నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. మొదట్లో ఈ వార్త చదివి సంతోషించిన నెటిజన్లు, చివరికి ఉత్తుత్తి న్యూస్‌ అని తెలుసుకొని ఉసూరుమన్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

వివరాల్లోకి వెళితే.. బెంగళూరు అనగానే ముందుగా గుర్తొచ్చేది అక్కడి ట్రాఫిక్‌. రోడ్డుపై ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి ఉంటుంది. అలాంటి ట్రాఫిక్‌లో మీ ప్రేయసి లేదా ప్రియుడితో ఎంచక్కా ఏసీ కారులో అది కూడా ఫుల్‌ ప్రైవసీతో వెళ్తే ఎలా ఉంటుంది.? ఊహించుకుంటేనే థ్రిల్‌గా ఉంది కదూ! స్మూచ్‌ క్యాబ్స్‌ అనే పేరుతో ఓ కొత్త క్యాబ్‌ సేవలు ప్రారంభమైనట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇవి కేవలం ప్రేమజంటల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు నెట్టింట ప్రచారం జరిగింది. 
 

34

ఓలా, ఉబెర్‌లా మిగతా క్యాబ్‌లా కాకుండా, ప్రేయసి ప్రియుడు కలిసి ప్రశాంతంగా, రొమాంటిక్‌గా టైం స్పెండ్ చేయడానికి అనుకూలంగా ఉంటాయంటూ ప్రచారం జరిగింది. ఈ సర్వీస్‌ గురించి తెలిసిన తర్వాత చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అయితే నిజానికి ఇలాంటి క్యాబ్ అనేదే లేదు ఇది కేవలం ఫన్‌ కోసం చేసిన ప్రచారం మాత్రమే. ‘Schmooze’ అనే మీమ్ బేస్డ్ డేటింగ్ యాప్‌ నుంచి ఈ ఫేక్ ప్రచారం మొదలైంది. అయితే ఇది నిజమైన సర్వీస్ కాదన్న విషయం ఆలస్యంగా బయటపడింది. చాలా మంది నమ్మిపోయి సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో ఈ విషయం వైరల్ అయ్యింది.
 

44

అసలు ఎలా మొదలైంది.? 

ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో చేసిన పోస్ట్‌ తర్వాత ఈ వార్త వైరల్‌ అయ్యింది. "బెంగళూరులోని ఓ స్టార్ట్‌అప్‌ ‘స్మూచ్ క్యాబ్స్’ అనే సర్వీస్‌ను ప్రారంభించిందట. ఇది ప్రేమజంటల కోసం ప్రత్యేకంగా తయారు చేశారట, వీళ్లు అందులో ప్రైవేట్ టైం గడిపొచ్చట. త్వరలోనే ఢిల్లీలో 'హగ్‌ ఆటోస్‌' కూడా వస్తాయోమో' అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. అయితే ఆ తర్వాత ఈ వార్తలో నిజం లేదని కేవలం ఒక ప్రచారం మాత్రమే అని తర్వాత తెలిసింది. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఇక అంతే సంగ‌తులు.. కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న
Recommended image2
మోదీ ప‌ర్య‌ట‌న‌వేళ తీవ్ర క‌ల‌క‌లం.. న‌కిలీ ఐడీ, తుపాకీతో ప‌ట్టుబ‌డ్డ వ్య‌క్తులు
Recommended image3
Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved